హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Courses after Intermediate: ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్... ఈ కోర్సుల్లో చేరొచ్చు

Courses after Intermediate: ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్... ఈ కోర్సుల్లో చేరొచ్చు

Courses after Intermediate: ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్... ఈ కోర్సుల్లో చేరొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

Courses after Intermediate: ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్... ఈ కోర్సుల్లో చేరొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Courses after Intermediate | ఇంటర్ పాసైన విద్యార్థులు ఏ కోర్సులు చేయాలన్న ఆలోచనలో ఉండటం మామూలే. ఇంటర్ తర్వాత చదవడానికి అనేక కోర్సులు ఉన్నాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌తో పాటు ఇతర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు (AP Inter Results 2022) విడుదలయ్యాయి. ఫలితాలు చెక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఇంటర్ పాసైన తర్వాత విద్యార్థులకు అనేక సందేహాలు మొదలవుతాయి. ఇంటర్ తర్వాత ఏ కోర్సుల్లో (Courses after Inter) చేరాలి? ఏ కెరీర్ ఎంచుకోవాలి? ఏ కోర్సు చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది? ఇలా అనేక డౌట్స్ వస్తాయి. ఇంటర్మీడియట్ పాసైనవారికి అనేక కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చేయొచ్చు. అయితే ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్ట్స్ చదివినవారు ఆ తర్వాత అవే సబ్జెక్ట్స్‌తో కోర్సులు చేయొచ్చు. మరి ఇంటర్ పాసైనవారికి ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి.

ఇంటర్‌లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన వారికి ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్ కోర్సులు ఉన్నాయి. డిగ్రీలో సంబంధిత సబ్జెక్ట్స్‌తో బీఎస్‌సీ చదవొచ్చు. లేదా టీచింగ్, మేనేజ్‌మెంట్, న్యాయ శాస్త్రానికి సంబంధించిన డిగ్రీ కోర్సులు చేయొచ్చు. ఇక టెక్నికల్ కోర్సుల విషయానికి వస్తే బీటెక్ లేదా బీఈ కోర్సులు చదవొచ్చు. ఇందులో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇలా వేర్వేరు బ్రాంచ్‌లు ఉంటాయి.

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... అప్లై చేయండిలా

అయితే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (EAPCET) పరీక్షకు అప్లై చేసి ఉంటే ఇందులో వచ్చిన మెరిట్‌తో తమకు కావాల్సిన కాలేజీల్లో సీట్లు పొందొచ్చు. ఇంటర్ తర్వాత డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ లాంటి సబ్జెక్ట్స్‌తో డిప్లొమా కోర్సులు చేయొచ్చు.

ఇక ఇంటర్ బయాలజీ విద్యార్థులు మెడిసిన్ కోర్సులు చదవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మెడిసిన్‌తో పాటు బీడీఎస్, ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఫిజియోథెరపీ, లా, మేనేజ్‌మెంట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చేయొచ్చు. బయోకెమిస్ట్రీ, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, హోటల్ మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బాటనీ, జువాలజీ, జెనెటిక్స్ లాంటి కోర్సులు ఉంటాయి.

Jobs in TCS: ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ చదివినవారికీ టీసీఎస్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఫ్యాషన్, డిజైనింగ్ కోర్సులున్నాయి. ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, ఫర్నీచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కోర్సులు చేయొచ్చు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ యోగా, బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ చదవొచ్చు.

ఇంటర్ సీఈసీ విద్యార్థులు బీకామర్స్, చార్టెర్డ్ అకౌంటెన్సీ, బ్యాచిలర్స్‌లో ఎకనమిక్స్, కంపెనీ సెక్రటరీషిప్ కోర్స్, లా, మేనేజ్‌మెంట్, టీచింగ్ కోర్సులు చదవొచ్చు. ఆర్ట్స్‌ కోర్సులు చదవాలనుకునేవారికి సోషల్ వర్క్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మల్టీమీడియా, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, హిస్టరీ, హ్యుమానిటీస్, ఫైనాన్స్, లిటరేచర్, ఫిలాసఫీ, సైకాలజీ కోర్సులున్నాయి.

విద్యార్థులు తమ అభిరుచికి, ఆసక్తికి తగ్గ కోర్సుల్ని ఎంచుకొని కెరీర్ రూపొందించుకోవచ్చు. అయితే ఇంటర్ తర్వాత చేయాల్సిన కోర్సులు ఎంచుకునేప్పుడు, ఆ తర్వాత కూడా ఏఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి.

First published:

Tags: AP Inter Results 2022, Ap intermediate results, Career and Courses, JOBS

ఉత్తమ కథలు