హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే

AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే

AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

AP Inter Supplementary Exams | ఏపీ ఇంటర్ బోర్డు ఇంటర్ ఫలితాల (AP Inter Results 2022) రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్ష తేదీలను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలు (AP Inter Resluts 2022) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్టియర్‌లో 54 శాతం మంది, సెకండియర్‌లో 61 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. విద్యార్థులకు రీకౌంటింగ్, రీఫెరిఫికేషన్, సప్లిమెంటరీ షెడ్యూల్ ప్రకటించింది ఏపీ ఇంటర్ బోర్డు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం జూన్ 25 నుంచి జూలై 5 వరకు దరఖాస్తు చేయొచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టులో జరుగుతాయి. 2022 ఆగస్ట్ 3 నుంచి 2022 ఆగస్ట్ 12 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు 2022 ఆగస్ట్ 17 నుంచి ఆగస్ట్ 22 మధ్య జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షకు 2022 జూలై 8 లోగా అప్లై చేయాలి.

AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేయాల్సిన లింక్స్ ఇవే


ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,41,358 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,45,358 ఉండగా, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,23,455 ఉన్నారు. ఇక ఒకేషనల్ విద్యార్థులు 72,299 ఉన్నారు. ఫస్టియర్‌లో 2,41,599 మంది విద్యార్థులు పాసయ్యారు. ఫస్టియర్ ఉత్తీర్ణత 54 శాతం. సెకండ్ ఇయర్‌లో 2,58,449 మంది విద్యార్థులు పాసయ్యారు. సెకండియర్ ఉత్తీర్ణత 61 శాతం. ఫస్టియర్‌లో 49 శాతం మంది బాలురు, 65 శాతం మంది బాలికలు పాస్ కాగా, సెకండియర్‌లో 59 శాతం మంది బాలురు, 68 శాతం మంది బాలికలు పాసయ్యారు.


ఫస్టియర్, సెకండియర్‌లో బాలికల పాస్ పర్సెంటేజీ ఎక్కువగా ఉంది. జిల్లాలవారీగా చూస్తే కృష్ణా జిల్లా 75 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉండగా కడప జిల్లా 55 శాతంతో చివరి స్థానంలో ఉంది.

First published:

Tags: AP inter board, AP Inter Exams 2022, AP Inter Results 2022, AP intermediate board exams, Ap intermediate results, JOBS

ఉత్తమ కథలు