AP INTER RESULTS 2020 | ఏపీ ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక సమస్యలు

ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయడం, అది కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతో సర్వర్‌లు మొరాయించాయని తెలుస్తోంది. ఫలితాలు విడుదలకు సంబంధించి ఇంటర్ బోర్డు, విద్యాశాఖ సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: June 12, 2020, 5:55 PM IST
AP INTER RESULTS 2020 | ఏపీ ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక సమస్యలు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదలయ్యాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను ప్రకటించిన వెంటనే.. ఇంటర్ విద్యార్ధులు, తల్లిదండ్రులు రిజల్ట్స్ కోసం ఎగబడ్డారు. కానీ సాంకేతిక సమస్యతో ఫలితాలు అందుబాటులోకి రాలేదు. హాల్ టికెట్ నెంబర్, తరగతి, పుట్టిన రోజును ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత.. సర్వీస్ అందుబాటులో లేదు అనే సందేశం కనిపించింది. సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేయగా.. 6 గంటలకు కూడా ఫలితాలను పొందలేకపోయారు. ఫలితాలు ఎప్పుడు అందుబాటలోకి వస్తాయా? అని విద్యార్థులు నీరిక్షిస్తున్నారు. ఐతే ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయడం, అది కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతో సర్వర్‌లు మొరాయించాయని తెలుస్తోంది. ఫలితాలు విడుదలకు సంబంధించి ఇంటర్ బోర్డు, విద్యాశాఖ సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా, ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 5,07,230 మంది హాజరు కాగా..300,560 మంది పాస్ అయ్యారు. అంటే 59 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు. ఇక ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,35,653 మంది హాజరవగా.. 2,76,389 మంది పాస్ అయ్యారు. అంటే, 63 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో బాలికలు సత్తా చాటారు. మొదటి సంవత్సరంలో 2,57,619 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, అందులో 1,64,365 ఉత్తీర్ణత సాధించారు. అంటే, 64 శాతం పాస్ అయినట్టు. మొదటి సంవత్సరం బాలుర విషయానికి వస్తే 2,49,611 మంది పరీక్షకు హాజరయ్యారు.
Published by: Shiva Kumar Addula
First published: June 12, 2020, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading