AP Inter Results 2020 | నేడే ఏపీ ఇంటర్మీడియెట్ ఫలితాలు

విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధమైంది. ఏపీలో శుక్రవారం ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను నేడు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

news18-telugu
Updated: June 12, 2020, 5:18 PM IST
AP Inter Results 2020 | నేడే ఏపీ ఇంటర్మీడియెట్ ఫలితాలు
ప్రస్తుతం జవాబు పత్రాల స్కానింగ్, మార్కులు అప్‌లోడింగ్, తుది పరిశీలన, ఇంటర్నెట్ మెమోల రూపకల్పన వంటి సాంకేతిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఉమర్ జలీల్ పేర్కొన్నారు.
  • Share this:
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధమైంది. ఏపీలో శుక్రవారం ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను జూన్ 12న సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షా ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు. గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటిస్తారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం గ్రేడ్లను ప్రకటిస్తారు. జూన్15 నుంచి ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్లో షార్ట్ మెమోలను అందుబాటులో ఉంచుతారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:

1. https://bie.ap.gov.in/ లేదా https://telugu.news18.com/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. AP Inter result (first and second year)పై క్లిక్ చేయండి.

3. హాల్ టికెట్ నెంబర్‌తో పాటు అవసరమైన వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి.

4. మీ యొక్క ఇంటర్ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
Published by: Krishna Adithya
First published: June 12, 2020, 6:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading