AP Inter Results 2020 | కార్పొరేట్ కాలేజీలకు ప్రభుత్వం ఝలక్...

AP Manabadi Inter 2nd Year result 2020 | కార్పొరేట్ కాలేజీల ప్రచార ఆర్భాటాలకు ప్రభుత్వం బ్రేక్ వేసింది.

news18-telugu
Updated: June 12, 2020, 6:07 PM IST
AP Inter Results 2020 | కార్పొరేట్ కాలేజీలకు ప్రభుత్వం ఝలక్...
NTA UGC NET 2020: యూజీసీ నెట్ దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం )
  • Share this:
AP Manabadi Inter 1st Year result 2020 |  ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి రెండింటినీ ఒకేసారి విడుదల చేశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 59 శాతం మంది పాస్ అయ్యారు. రెండో సంవత్సరానికి చెందిన 63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రెండు సంవత్సరాల్లోనూ బాలికలు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 64 శాతం, సెకండియర్‌లో 67 శాత మంది బాలికలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. బాలురకు సంబంధించి 55 శాతం ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 60 శాతం మంది సెకండియర్ విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే, పరీక్ష ఫలితాల సందర్భంగా విద్యాశాఖ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల ఫలితాల మార్కులను, ఫొటోలను వాడుకుని ఎలాంటి ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు. ఆ రకంగా కార్పొరేట్ కాలేజీల ప్రచారానికి చెక్ పెట్టారు.

గతంలో ఇంటర్ ఫలితాలు అంటే రిజల్ట్స్ వచ్చిరాగానే 1, 1, 1, 2, 2, 2 అంటూ టీవీల్లో హోరెత్తించేవారు. అలాగే, పేపర్ల నిండా ఫుల్ పేజీ యాడ్స్ ప్రకటనలు దర్శనం ఇచ్చేవి. అయితే, గ్రేడ్లు సిస్టం వచ్చినా కూడా ప్రచారం మానలేదు. గ్రేడ్లలోనూ తామే టాప్ అంటూ వివిధ కార్పొరేట్ కాలేజీలు రకరకాల యాడ్స్ గుప్పించేవి. వీటన్నిటికీ చెక్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేట్ కాలేజీల ప్రచారం మోజులో పడి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 12, 2020, 6:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading