హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Ap Inter Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

Ap Inter Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ (BIEAP) తాజాగా ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే సరికొత్త షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ (BIEAP) తాజాగా ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే సరికొత్త షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ (BIEAP) తాజాగా ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే సరికొత్త షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

  ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ (BIEAP) తాజాగా ప్రకటించింది. శుక్రవారం (మార్చి 11) నుంచి జరగాల్సిన ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ (Inter Practical Exams) వాయిదా పడ్డాయి. ఈ ఎగ్జామ్స్ కోసం సరికొత్త షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని బోర్డు తన అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.inలో తెలియజేసింది. అయితే మరికొద్ది రోజుల్లోనే సరికొత్త షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను జంబ్లింగ్ విధానంలో కండక్ట్ చేస్తామని మార్చి 3న ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు వరకు నాన్-జంబ్లింగ్ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తామంటూ ఏపీ బోర్డు చెప్పుకొచ్చింది. అలా చెబుతూనే కేవలం వారం రోజుల సమయం ఉండగా... జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తామని ప్రభుత్వం ఉన్నపళంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో గురువారం నాడు ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు చివరి దశలో పరీక్షల నిర్వహణా విధానాన్ని మార్చడం సరైంది కాదని అభిప్రాయపడింది.

  ఇలా మార్చడానికి ప్రభుత్వం వద్ద సరైన కారణం కూడా లేదని వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు కొట్టివేస్తూ ఎప్పటిలాగానే పరీక్షలను యథావిధిగా నాన్-జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 11 నుంచి 31 వరకు జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది. “ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తాం. ఆ తేదీలను త్వరలో ప్రకటిస్తాం’’ అని అధికారిక నోటీసులో ఏపీ ఇంటర్ బోర్డు పేర్కొంది.

  AP Inter 1st Year Botany Model Paper-1: ఏపీ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ బోట‌నీ సిల‌బ‌స్‌.. మోడ‌ల్ పేప‌ర్ డోన్‌లోడ్ చేసుకోండి

  ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కొద్ది రోజుల క్రితం ఏపీ ఇంటర్ థియరీ (Inter Theory) బోర్డ్ ఎగ్జామ్స్ 2022ని కూడా రీషెడ్యూల్ చేసింది. ఈ ఎగ్జామ్స్ జేఈఈ మెయిన్ 2022 పరీక్ష తేదీలతో క్రాష్ కావడంతో ఏపీ బోర్డు రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. పాత షెడ్యూల్ ప్రకారం ఏపీ ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 9న ప్రారంభమై ఏప్రిల్ 28న ముగియాల్సి ఉంది. మరోవైపు జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనుంది. దీంతో వీటి రెండు తేదీలు ఒకేసారి వస్తుండటంతో ఏపీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ పరీక్షలు పూర్తయిన తర్వాతనే అంటే ఏప్రిల్ 22 నుంచి ఇంటర్ థియరీ పరీక్షలు నిర్వహించేలా రీషెడ్యూల్ చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, ఇంటర్‌ థియరీ ఎగ్జామ్స్ ఏప్రిల్ 22 స్టార్ట్ అయ్యి మే 12వ తేదీ వరకు జరుగుతాయి.

  AP Inter 1st Year Zoology Model Paper-1: ప్లాన్డ్‌గా చదవండి.. ఏపీ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ జువాల‌జీ మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్‌ చేసుకోండి

  ఇదిలా ఉండగా, సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్ష తేదీషీట్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమై జూన్ 15 వరకు కొనసాగుతాయి. ఇది మే 24 నుంచి 29 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2తో క్రాష్ అవుతోంది. అందుకే ఈ రెండో సెషన్‌ను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

  First published:

  Tags: AP Inter Exams 2022, Career and Courses, Exams

  ఉత్తమ కథలు