AP INTER HALL TICKETS ANDHRA PRADESH BOARD OF INTERMEDIATE EDUCATION RELEASED PRACTICAL HALL TICKETS MARCH 2022 KNOW HOW TO DOWNLOAD SS
AP Inter Hall Tickets: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయండిలా
AP Inter Hall Tickets: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)
AP Inter Hall Tickets | ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (APBIE) ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల చేసింది. ఎలా డౌన్లోలోడ్ చేయాలో తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు (AP Inter Exams) జరగనున్నాయి. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అంతకన్నా ముందే కళాశాలల్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ పరీక్షలు మార్చిలోనే ఉంటాయి. ఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన హాల్ టికెట్స్‌ను ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (APBIE) విడుదల చేసింది. ఏపీ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయొచ్చు. మరి ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోండి.
AP Inter Hall Tickets: ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయండి ఇలా
Step 1- విద్యార్థులు ముందుగా ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ https://bie.ap.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ మార్చి 2022 కి సంబంధించిన రోల్ నెంబర్ లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 4- Download Hall Ticket పైన క్లిక్ చేయాలి.
Step 5- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
విద్యార్థులు రోల్ నెంబర్‌ను తమ కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి పొందొచ్చు. లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్‌తో కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయొచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన హాల్ టికెట్స్ కేవలం 2022 మార్చిలో జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించినవి మాత్రమే. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరగబోయే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ త్వరలో రిలీజ్ అవుతాయి. వీటిని కూడా ఏపీ ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ https://bie.ap.gov.in/ లో డౌన్లోడ్ చేయొచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థుల కోసం News18 Telugu సిలబస్, మోడల్ పేపర్స్‌కు సంబంధించిన ప్రత్యేక కథనాలను పబ్లిష్ చేస్తోంది. విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేసి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్స్, సిలబస్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు.
ఏప్రిల్ 22- 2nd లాంగ్వేజ్ పేపర్ I
ఏప్రిల్ 25- ఇంగ్లీష్ పేపర్-I
ఏప్రిల్ 27- మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, సివిక్స్ పేపర్ I
ఏప్రిల్ 29- మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్ I
మే 02- ఫిజిక్స్ పేపర్-I, ఎకనమిక్స్ పేపర్ I
మే 06- కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ I, సోషియాలజీ పేపర్ I, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ I
మే 9- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, లాజిక్ పేపర్ I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)
మే 11- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I
ఏపీ సెకండ్ ఇయర్ పరీక్ష షెడ్యూల్
ఏప్రిల్ 23- 2nd లాంగ్వేజ్ పేపర్ II
ఏప్రిల్ 26- ఇంగ్లీష్ పేపర్-II
ఏప్రిల్ 28- మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, సివిక్స్ పేపర్ II
ఏప్రిల్ 30- మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్ II
మే 05- ఫిజిక్స్ పేపర్-II, ఎకనమిక్స్ పేపర్ II
మే 07- కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ II, సోషియాలజీ పేపర్ II, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ II
మే 10- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, లాజిక్ పేపర్ II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)
మే 12- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.