తెలంగాణ ఇంటర్ బోర్డ్ (AP Inter Board) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇటీవల వాయిదా పడిన ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ (Inter Exams) కు సంబంధించిన తేదీలను విడుదల చేసింది. ఈ నెల 16ను ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. ఈ ఎగ్జామ్స్ ఏప్రిల్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డ్ కార్యదర్శి శేషగిరి బాబు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటనలో విడుదల చేశారు. నాన్ జంబ్లింగ్ విధానంలో ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నారు. అంటే విద్యార్థులు చదివిన కాలేజీలోనే పరీక్షలు ఉంటాయి. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఈ నెల 14వ తేదీ అంటే రేపటి నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని బోర్డు సూచించింది. వాస్తవానికి ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 11 నుంచి జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ ఈ నెల 10న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ తాజాగా నూతన షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను జంబ్లింగ్ విధానంలో కండక్ట్ చేస్తామని మార్చి 3న ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులను విడుదల చేసింది. అంతకు ముందు వరకు నాన్-జంబ్లింగ్ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తామంటూ ఏపీ ఇంటర్ బోర్డ్ చెప్పుకొచ్చింది. అలా చెబుతూనే కేవలం వారం రోజుల సమయం ఉండగా... జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో గురువారం నాడు ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు చివరి దశలో పరీక్షల నిర్వహణ విధానాన్ని మార్చడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.