ఇంటర్మీడియట్‌లో కీలక మార్పులు.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం

ఇంటర్మీడియట్‌లో యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు దీన్ని తీసుకొస్తున్నారు.

news18-telugu
Updated: July 12, 2020, 9:21 AM IST
ఇంటర్మీడియట్‌లో కీలక మార్పులు.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్ మూలంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో విద్యా సంవత్సరం రద్దవుతుందా అన్న అనుమానాలు ఒక దశలో వెలువడ్డాయి. కానీ ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులను ఆటోమెటిక్‌గా ప్రమోట్ చేయడం.. పదో తరగతి విద్యార్థులను పాఠశాలలో నిర్వహించిన గత పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను పాస్ చేస్తూ ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇకపోతే ఇంటర్మీడియట్ పరీక్షలు అప్పటికే నిర్వహించడం వల్ల గట్టెక్కినట్టయ్యింది. యూజీ, పీజీ పరీక్షలకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇంటర్మీడియట్‌లో యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు దీన్ని తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే సబ్జెక్టుకు ఒక వర్క్ బుకు ప్రత్యేకంగా ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు అనుగుణంగా బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు నింపడం వంటి ప్రశ్నలతో వీటిని రూపొందిస్తున్నారు. ఆగస్టు మూడు నుంచి కళాశాలలను ప్రారంభించేలా ఇంటర్ విద్యాశాఖ ఈ ఏడాది అకడమిక్ క్యాలండర్-2021ను సిద్ధం చేసింది. కాలేజీల్లో ఉదయం సమయంలో సైన్సు, మధ్యాహ్నాం సమయంలో ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహిస్తారు. తమ పరిస్థితులకు అనుగుణంగా కళాశాలలు వీటిని మార్పు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.

ఈ విద్యాసంవత్సరంలో కాలేజీలు మొత్తం 196 రోజులు పని చేయనున్నాయి. సీబీఎస్ఈ తరహాలో 30 శాతం పాఠ్యాంశాలు తగ్గించనున్నారు.  కాలేజీలు రెండో శనివారం సైతం పని చేయాల్సి ఉంటుంది. పండగ సెలవులు ఒకట్రెండు రోజులు మాత్రమే ఉండనున్నాయి. విద్యార్థులకు యూనిట్ పరీక్షలు ఉండడంతో పాటు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించేందుకు వీలుగా వీడియోలను రూపొందించే పనిలో ఉన్నారు. ఎప్పటి మాదిరిగానే మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు.
Published by: Narsimha Badhini
First published: July 12, 2020, 9:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading