హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter Results: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే.. ఇలా చెక్ చేసుకోండి

AP Inter Results: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే.. ఇలా చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఇంటర్ ఫలితాలను రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఈ లింక్స్ ద్వారా తమ రిజల్స్ ను నేరుగా చెక్ చేసుకోవచ్చు.

ఏపీలో ఇంటర్ ఫలితాలు (AP Inter Results) రేపు ఉదయం విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Sathyanarayana) రేపు ఉదయం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ (AP Inter Board) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. లేదా.. https://examresults.ap.nic.in వెబ్ సైట్ ద్వారా కూడా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లతో పాటు News18 Telugu వెబ్‌సైట్‌లో కూడా https://telugu.news18.com/ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.  గతం వారం పది రోజులుగా ఇంటర్ ఫలితాలపై ఊహానగాలు జోరుగా వినిపించాయి. తొలుత ఈ నెల 15వ తేదీ నాడే ఇంటర్ ఫలితాలు విడుదల అవుతాయని జోరుగా ప్రచారం సాగింది. అయితే.. ఇంటర్ బోర్డ్ ఆ రోజు ఫలితాలను విడుదల చేయడం లేదని స్పష్టం చేయడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది.

ఆ సమయంలో మరో వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రేపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఏపీలో ఇంటర్‌ పరీక్షలను మే 6వ తేదీ నుంచి 24 వరకు నిర్వహించింది ఇంటర్ బోర్డు. ఈ పరీక్షలకు దాదాపు 4,64,756 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా గత వారం, పది రోజులుగా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సారి టెన్త్ పరీక్షల్లో చాలా తక్కువ పాస్ పర్సంటేజ్ నమోదైంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. కరోనా ప్రత్యేక పరిస్థితులే ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణమని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ఈ సారి ఇంటర్ ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన సైతం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది.

JEE Preparation Tips: ఎల్లుండి నుంచే జేఈఈ సెషన్-1 ఎగ్జామ్స్.. విద్యార్థుల కోసం ఈ ప్రిపరేషన్ టిప్స్..

ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ను విద్యార్థులు ఫాలో కావాల్సి ఉంటుంది..

Step 1: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయగానే అభ్యర్థులు  https://bie.ap.gov.in/ లేదా.. https://examresults.ap.nic.in వెబ్ సైట్లను ఓపెన్ చేయాలి.


Step 2: అనంతరం హోం పేజీలో రిజల్ట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీ రిజల్ట్ హోం స్క్రీన్ పై కనిపిస్తుంది.

Step 4: రిజల్ట్స్ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

First published:

Tags: Ap intermediate results, Botsa satyanarayana, Exams, JOBS

ఉత్తమ కథలు