సేకరణ: భాను ప్రసాద్, విజయనగరం
రచయిత: రమణ, ఇంగ్లిష్ లెక్చరర్, గుర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ
కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పరీక్షలను నిర్వహించాల్సిన షెడ్యూల్ ను వాయిదా వేయడమో, సిలబస్ తగ్గించడమో చేయాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రభుత్వం గత ఏడాది ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు పరీక్షలను ఎలాగైనా నిర్వహించాలన్న నిర్ణయంతో.. వాయిదా పడ్డ పరీక్షలను ప్రతీ సబ్జెక్ట్ లోనూ 70 శాతం సిలబస్ తో మాత్రమే కండక్ట్ చేసారు. మిగిలిన 30 శాతం సిలబస్ ను ఎగ్జామ్స్ నుండి తొలగించి ప్రశ్నాపత్రాలు ఇచ్చారు. ఈ ఏడాది వైరస్ ప్రభావం కొంత తగ్గడంతో విధ్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎలాగైనా ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వాలు భావించి.. ఈ మేరకు పరీక్షల తేదీలను సైతం విడుదల చేశారు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు. కానీ.. ఈ ఏడాది కూడా కోవిడ్ కారణంగా ఆన్లైన్ విధానంలోనే క్లాసులు జరిగాయి. దీంతో సిలబస్ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో.. విద్యార్ధుల భవిష్యత్తు ద్ళష్ట్యా.. ఈ ఏడాది కూడా 30 శాతం సిలబస్ ను కొంత మేర తగ్గించారు.
ఈ కారణాల దృష్ట్యా ప్రశ్నాపత్రాలను కూడా ఆ 70 శాతం నుంచే ఇచ్చేలా సిలబస్ (Syllabus) తగ్గించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు అందిస్తోంది న్యూస్18 తెలుగు. ఇందులో భాగంగా గుర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఇంగ్లీష్ అధ్యాపకులైన రమణ.. అందించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్.. విద్యార్థుల కోసం..
సెకండియర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ లో ఎప్పటిలానే ప్రతీ ఏడాదిలానే 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ప్రోజ్(గద్య భాగం)(PROSE), పోయెట్రీ(పద్య భాగం)(POETRY), నాన్ డిటైల్డ్ (నామవాచకం)(NON DETAILED), కాంప్రెహెన్సివ్ ప్యాసేజెస్ (COMPREHENSION PASSAGES), గ్రామర్(వ్యాకరణం) (GRAMMER) ఇస్తారు. వీటి నుండి ప్రతీ ఏడాది పరీక్షలలో పద్య భాగం, గద్య భాగం, కాంప్రెహెన్సివ్ ప్యాసేజెస్.. మూడూ కలిపి 50 మార్కులకు, వ్యాకరణం(GRAMMER) 50 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. విద్యార్ధులకు ఇంగ్లీష్ భాష అలవడటం కోసం, విద్యార్ధులు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో.. ఒక్క గ్రామర్ నుండి మాత్రమే 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ను మూడు సెక్షన్లుగా విభజించారు. SECTION-A, SECTION-B, SECTION-C గా మూడు భాగాలు ఉంటాయి.
SECTION-A లో మొదటి 40 మార్కులకు ప్రోజ్(గద్య భాగం)(PROSE) 16 మార్కులు, పోయెట్రీ(పద్యభాగం)(POETRY) 16 మార్కులు, నాన్ డిటైల్డ్ (నామవాచకం)(NON DETAILED) అయిన ADVENTURES OF TOM SAWYER నుండి 8 మార్కులు ఉంటాయి.
SECTION-B లో కాంప్రెహెన్షన్ ప్యాసేజెస్ (COMPREHENSION PASSAGES) 10 మార్కులు, (NON DETAILED) అయిన ADVENTURES OF TOM SAWYER నుండి ఒక ప్యాసేజ్(PASSAGE) వస్తాయి. మొత్తంగా 20 మార్కులు ఉంటాయి.
SECTION-C మొత్తం గ్రామర్ (GRAMMAR) పార్ట్ ఉంటుంది. ఇందులో 8 సబ్ సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ లో 5 మార్కుల చొప్పున మొత్తం 40 మార్కులు ఉంటాయి.
మొత్తంగా SECTION-Aలో ఐదు సబ్ సెక్షన్స్, SECTION-B లో 4 సబ్ సెక్షన్లు, SECTION-C లో గ్రామర్ పార్ట్ లో 8 సబ్ సెక్షన్స్ ఉంటాయి.
మొదట SECTION-A చూద్దాం.
1) ప్రోజ్( prose)లో ఉన్న 5 పాఠాలు(లెసన్స్)LESSONS నుండి పరీక్షలో 4 సందర్భ వ్యాక్యాలు (annotations) వస్తాయి. ఇందులో రెండు ఛాయిస్ కాగా, రెండు సమాధానాలు 10 నుంచి 15 లైన్ల మధ్య రాయాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలకు 4 మార్కుల చొప్పున 8 మార్కులు ఉంటాయి.
2) ఇందులో పోయెట్రీ(POETRY) లో 5 పద్యాలు(POEMS) నుండి పరీక్షలో 4 సందర్భ వ్యాక్యాలు (annotations) 8 మార్కులకు వస్తాయి. ఇందులో రెండు ఛాయిస్ కాగా, రెండు రాయాల్సి ఉంటుంది.
3) ప్రోజ్ (గద్యభాగం)(poetry) నుండి మరో 8 మార్కులకు 2 పేరాగ్రాఫ్ జవాబులు రాయాల్సి ఉంది. వీటిలో ఛాయిస్ ఉండదు. రెండూ రాయాల్సి ఉంటుంది.
4)పోయెట్రీ (పద్య భాగం) (poetry) మరో 8 మార్కులకు 2 పేరాగ్రాఫ్ ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. 10 నుండి 15 లైన్ల జవాబులు రాయాలి. ఛాయిస్ ఉండదు.
5) ఈ సెక్షన్ లో నాన్ డిటైల్డ్(NON DETAILED) అయిన ADVENTURES OF TOM SAWYER నుండి ఇస్తారు. ఇందులో 8 చాప్టర్లు ఉంటాయి. ఈ చాప్టర్ల నుండి మూడు ఎస్సై ప్రశ్నలు ఇస్తారు. ఇందులో రెండు ఛాయిస్ కాగా, ఒక దానికి సమాధానం రాయాలి. 8 మార్కులు ఉంటాయి. 25 నుండి 30 లైన్ల మధ్య వ్యాసరూప సమాధానం రాయాలి. మొత్తంగా ప్రోజ్ నుండి 16 మార్కులు, పోయెట్రీ నుండి 16 మార్కు లు, నాన్ డిటైల్డ్ నుండి మరో 8 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మొత్తంగా SECTION-A నుండి 40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
రెండవది SECTION-B చూద్దాం. ఇందులో 4 సబ్ సెక్షన్లు ఉంటాయి.
6-7) సబ్ సెక్షన్ల కింద రెండు కాంప్రెహెన్షన్ ప్యాసేజెస్(COMPREHENSIVE PASSAGES)కు సంబంధించిన ప్యాసేజెస్ వస్తాయి. ఈ సెక్షన్ లో రెండు ప్యాసేజెస్ నుండి 10 మార్కులకు ఉంటాయి. ఒక ప్యాసేజ్ బయట నుండి ఉంటుంది. మరొకటి ADVENTURES OF TOM SAWYER నుండి ఉంటుంది. ఒక్కో ప్యాసేజ్ కింద ఐదు ప్రశ్నలు ఇచ్చి వాటికి సమాధానాలు రాయమంటారు. సరైన జవాబులు రాయాల్సి ఉంది. ఛాయిస్ ఉండదు.
8)లో ఒక అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చి అందులో 5 ప్రశ్నలు ఇస్తారు. వాటికి సమాధానాలు రాయాలి. ఛాయిస్ ఉండదు. 5 మార్కులు ఉంటాయి.
9) లో పైచార్ట్ (piechart), గానీ ఫ్లోచార్ట్(flow chart) గానీ టేబుల్(table) గానీ, ట్రీ డయాగ్రామ్ (tree diagram) గానీ ఇచ్చి అందులోంచి 5 ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు అడుగుతారు. దీనికి 5 మార్కులు ఉంటాయి. చాయిస్ ఉండదు. దీంతో SECTION-Bలో 20 మార్కులు ఉంటాయి. మొత్తంగా SECTION-A లో ఐదు సబ్ సెక్షన్స్ నుండి 40 మార్కులు, SECTION-B లోని రెండు సబ్ సెక్షన్ ల నుండి 20 మార్కులు మొత్తంగా 60 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
మూడవది SECTION-C చూద్దాం. ఇందులో గ్రామర్ ( వ్యాకరణం) (GRAMMER) పార్ట్ కు సంబంధించి మొత్తం 8 సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ నుండి 40 మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
10) లో లెటర్ రైటింగ్ ఉంటుంది. రెండు ఇస్తారు. ఒకటి ఫార్మల్ లెటర్ రెండవది ఇన్ ఫార్మల్ లెటర్ ఇస్తారు. ఒకటి ఛాయిస్ ఉంటుంది. దీనికి 5 మార్కులు ఉంటాయి.
11)లో ఏదైనా ఒక జనరల్ టాపిక్ ఇచ్చి దాని ప్రాసెస్ కు సంబంధించి 8 లైన్లకు తగ్గకుండా సమాధానం రాయమంటారు. దీనికి 5 మార్కులు ఉంటాయి.
12) లో ఇచ్చిన వివరాలతో.. బయోడేటా (రెజ్యూమె) తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి 5 మార్కులు ఉంటాయి.
13)లో ఇచ్చిన సమాచారంతో.. బ్యాంక్ ఫామ్ నింపడం, ఇచ్చే 10 ఖాళీలను పూరించడం చేయాలి. దీనికి 5 మార్కులు ఉంటాయి.
14) ఇందులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ(CONVERSATION) ఎలా ఉంటుందో రాయాలి. example.. (షాప్ కీపర్ అండ్ కస్టమర్), (ప్రిన్సిపల్ అండ్ పేరెంట్) . ఇందులో రెండు టాపిక్స్ ఇస్తారు. ఒక దానికి సమాధానం రాయాలి. 5 మార్కులు ఉంటాయి.
15) లో ఎవరైనా ఒక రచయిత రాసిన ప్యాసేజ్ ఇస్తారు. దానిని అర్దం చేసుకొని మనం టైటిల్ తో సహా నోట్ రాయాల్సి ఉంటుంది. దీనికి 5 మార్కులు ఉంటాయి. చాయిస్ ఉండదు.
16) కాలమ్ మేచింగ్ చేయాలి. దీనికి 5 మార్కులు ఉంటాయి.
17) స్ట్రెస్ వర్డ్స్ .. ఇందులో 10 పదాలు ఇస్తారు. 5 పదాలకు కరెక్ట్ స్ట్రెస్ మార్క్స్ గీయాలి. గుర్తించాలి. దీనికి 5 మార్కులు ఉంటాయి. 5 ఛాయిస్ ఉంటాయి. మొత్తంగా (10 నుంచి 17 సబ్ సెక్షన్లు) ఈ SECTION-C లో ఉన్న 8 సబ్ సెక్షన్లు నుండి ఒక్కో సెక్షన్ కు 5 మార్కుల చొప్పున 40 మార్కులు ఉంటాయి.
మొత్తంగా SECTION-A లో 40 మార్కులు, SECTION-Bలో 20 మార్కులు, SECTION-C లో 40 మార్కులు కలిసి 100 మార్కులకు ప్రశ్నాపత్రం వస్తుందని నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ రవణ చెబుతున్నారు. పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చని ఆయన వివరించారు. గ్రామర్ పార్ట్ పై పట్టు సాధిస్తే.. SECTION-C నుంచి వచ్చే గ్రామర్ ప్రశ్నలకు తక్కువ సమయంలో సమాధానాలు రాసి ఎక్కువ మార్కులు సాధించవచ్చని ఆయన తెలిపారు. ప్రధానంగా ప్రోజ్ నుంచి ఈ ప్రశ్నలు, పోయెట్రీ నుండి ఈ ప్రశ్నలు రావచ్చు..
ఏ సెక్షన్ నుంచి ఎలా వస్తాయి..
SECTION-A లో ఉన్న ప్రోజ్(గద్య భాగం) లోని ఐదు LESSONS నుండి J.C.BOSE అనే ఒక lesson ను తొలగించారు. 4 లెసన్స్ నుండి మాత్రమే ప్రశ్నలు వస్తాయి. ఇక పోయెట్రీ (poetry) లోని ఐదు poems నుండి ఒక poem ను తొలగించారు. మిగిలిన నాలుగు poems నుండే ప్రశ్నలు వస్తాయి. అంటే SECTION-A లోని పద్య బాగం నుండి 4 లెసన్స్, గద్య భాగం నుండి 4 లెసన్స్ మాత్రమే మిగలాయి. అంటే గద్య, పద్య భాగాల నుండి ప్రతీ లెసన్ నుండి annotations, paragraph questions వస్తాయి. ఇక్కడ ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే.. గద్య(prose), పద్య(poetry) భాగాల నుండి ఉన్న ప్రతీ lesson నుండి ఒక annotation, ఒక paragraph question వస్తుంది. కాబట్టి ఉన్న సిలబస్ నుండి గద్య భాగంలో రెండు lessons, పద్య భాగం నుండి రెండు lessons చదివితే.. మొదటి నాలుగు sections రాసేయవచ్చు. మొత్తం 32 మార్కులు ఈజీగా సాధించవచ్చు. prose నుండి రెండు లెసన్స్, poetry నుండి రెండు లెసన్స్ చదివితే.. మొత్తంగా 32 మార్కులకు సమాధానాలు రాసేయవచ్చు. ఇక 5వ సెక్షన్ లో నాన్ డిటైల్డ్ (NON DETAILED) అయిన ADVENTURES OF TOM SAWYER నుండి 8 మార్కులకు 3 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 8 చాప్టర్లకు సంబంధించిన సమ్మరీ మనకు దొరుకుతుంది. మొదటి రెండు ప్రశ్నలు ఏవి ఇచ్చినా.. సమ్మరీ(SUMMERY) చదువుకుంటే.. ఒక ప్రశ్నకు సమాధానం ఈజీగా రాయొచ్చు. కాబట్టి.. ఈ 8 మార్కులు కూడా ఈజీగా సాధించవచ్చు. ఇందులో 1.WRITE A CHARACTOR SKETCH OF TOM SAWYER అనే ప్రశ్న తప్పక వస్తుంది.
SECTION-B లో 8వ సెక్షన్ లో అడ్వర్టైజ్ మెంట్ ను అర్ధం చేసుకోగలిగితే.. ఈజీగా 5 మార్కులు తెచ్చుకోవచ్చు. దీనికి సంబంధించిన జవాబులు కూడా ఆ అడ్వర్టైజ్ మెంట్ లోనే ఉంటాయి. సెక్షన్ 9లో పై చార్ట్ గానీ, టేబుల్ గానీ, ట్రీ డయాగ్రామ్ గానీ ఫ్లో చార్ట్ గానీ వస్తుంది. ఏది ఇచ్చినా మనం దాన్ని అర్ధం చేసుకుంటే.. ఈజీగా దాని కింద వచ్చే సమాధానాలు రాసేయవచ్చు..
SECTION-C నుండి గ్రామర్ పార్ట్ ఉంటుంది. లెటర్ రైటింగ్, బయోడేటా ప్రిపేర్ చేయడం, బ్యాంక్ ఫామ్ ఫిల్లింగ్, స్ట్రెస్ వర్డ్స్, కాలమ్ మేచింగ్ వంటి ఈజీ ప్రశ్నలు వస్తాయి. కొద్దిగా వీటిని ముందే ప్రాక్టీస్ చేయగలిగితే.. SECTION-Cలో మంచి మార్కులు సాధించవచ్చు. మొత్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పేపర్ మంచి మార్కులతో పాసయ్యే అవకాశం ఉంటుంది.
ఆల్ ది బెస్ట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams