హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter 2nd Year Botany Model Paper-1: ఏపీ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ బోట‌నీ ప‌రీక్ష‌ సిలబస్.. మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

AP Inter 2nd Year Botany Model Paper-1: ఏపీ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ బోట‌నీ ప‌రీక్ష‌ సిలబస్.. మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Inter 2nd Year Botany Model Paper-1 | బైపీసీ చ‌దువుతున్న విద్యార్థులు బోట‌నీలో మంచి స్కోర్ సాధించాలని చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు. వారి కోసం ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ బోట‌నీ ప‌రీక్ష‌లో వ‌చ్చే సెల‌బ‌స్‌, స్కోరింగ్ ఎలా చేయొచ్చో ఏ చాప్ట‌ర్ నుంచి ఎన్ని ప్ర‌శ్న‌లు వ‌స్తాయో తెలిపేలా న్యూస్ 18 ప్ర‌త్యేక మోడ‌ల్ పేప‌ర్ అందిస్తోంది. ఆల్ ది బెస్ట్‌

ఇంకా చదవండి ...

  సేకరణ: భాను ప్రసాద్, న్యూస్18 కరస్పాండెంట్, విజయనగరం

  ర‌చ‌యిత: కృష్ణ‌మూర్తి నాయుడు, బోటనీ లెక్చ‌ర‌ర్‌, విజ‌య‌న‌గ‌రం

  ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం సిలబస్ లో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఈ ఆరు యూనిట్లలో 13 చాప్టర్లు ఉన్నాయి. 1) ఫస్ట్ యూనిట్ వ్ళక్ష శరీర ధర్మ శాస్త్రం ప్లాంట్ ఫిజియాలజీ (PLANT PHYSIOLOGY) లో 1. మొక్కలలో రవాణా (ట్రాన్స్ పోర్ట్ ఆఫ్ ప్లాంట్స్) (TRANSPORT IN PLANTS) 2. ఎంజైమ్ లు(ఎంజైమ్స్) (ENZYME) 3. ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ (ఫోటో సింధసిస్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్)(PHOTO SYNTHASIS IN HIGHER PLANTS), ఎర్లీ ఎక్స్ పెరిమెంట్స్, సైట్ ఆఫ్ ఫోటో సింధసిస్, పిగ్మెంట్స్ ఇన్వాల్వ్డ్ 4. మొక్కలలో శ్వాసక్రియ (రెస్పిరేషన్ ఆఫ్ ప్లాంట్స్) RESPIRATION OF PLANTS) 5. మొక్క ఎదుగుదల & అభివ్ళద్ది (ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్) (PLANT GROWTH & DEVELOPMENT) అనే చాప్టర్లు ఉన్నాయి.2)రెండవ యూనిట్  సూక్ష్మజీవ శాస్త్రం ( మైక్రోబయాలజీ) (MICROBIOLOGY) లో..

  1. బాక్టీరియా (BACTERIA) 2. వైరసెస్ (VIRUSES) చాప్టర్లు ఉన్నాయి.3)మూడవ యూనిట్ జన్యుశాస్త్రం( జెనెటిక్స్) (GENETIC)లో అనువంశికతా సూత్రాలు, వైవిధ్యం (ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్) (PRINCIPLES OF INHERITENCE & VARIATION) ఒక చాప్టర్ ఉంది.4) నాల్గవ యూనిట్ అణు జీవ శాస్త్రం (మాలిక్యులర్ బయాలజీ)( MOLECULAR BIOLOGY) లో అణుస్దాయి ఆధారిత అనువంశికత (మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్) (MOLECULAR BIOLOGY OF INHERITENCE) అనే చాప్టర్ ఉంది.5) ఇక ఐదవ యూనిట్ జీవ సాంకేతిక శాస్త్రం(బయో టెక్నాలజీ)( BIOTECHNOLOGY) లో

  1.జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు, ప్రక్రియలు( ప్రిన్సిపల్స్ అండ్ ప్రోసెసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ) (PRINCIPLES & PROCESSES OF BIOTECHNOLOGY)

  2. జీవ సాంకేతిక శాస్త్రం అనువర్తనాలు (బయో టెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్) BIOTECHNOLOGY AND ITS APPLICATIONS), వ్యవసాయంలో జీవసాంకేతిక శాస్త్రం అనువర్తనాలు (బయో టెక్నలాజికల్ అప్లికేషన్స్  ఆఫ్ అగ్రికల్చర్) (BIOTECHNOLOGICAL APPLICATIONS OF AGRICULTURE) అనే రెండు చాప్టర్లు ఉన్నాయి.

  6)ఇక ఆరవ యూనిట్ అయిన మనిషి సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు (ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్) (PLANTS AND MICROBES IN HUMAN WELFARE) లో 1వ చాప్టర్ గా ఆహార ఉత్పత్తిని అధికం చేసే వ్యూహాలు (స్ట్రాటజీస్ ఆఫ్ ఎన్హాన్స్ మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్) (STRATEGIES OF ENHANCEMENTS IN FOOD PRODUCTION) ఉంది. ఇక 2వ చాప్టర్ గా మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు (మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్) MICROBES IN HUMAN WELFARE) అనే రెండు చాప్టర్లు ఉన్నాయి.

  కోవిడ్ కారణంగా గత ఏడాది సెకండ్ ఇయర్ బోటనీ పేపర్ లో కొంత సిలబస్ తగ్గించడం జరిగింది. ఈ ఏడాది కూడా 30 శాతం మేర సిలబస్ తగ్గించారు. మొత్తం ఆరు యూనిట్లలో యూనిట్ 1 నుండి రెండవ చాప్టర్ అయిన ఖనిజ పోషణ(మినరల్ న్యూట్రిషన్) (MINERAL NUTRITION) అనే చాప్టర్ మొత్తాన్ని తొలగించగా, 6వ చాప్టర్ అయిన మొక్క ఎదుగుదల & అభివ్ళద్ది (ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్) (PLANT GROWTH AND DEVELOPMENT) అనే చాప్టర్ నుండి కొన్ని అంశాలను తొలగించారు. ఇక 6వ యూనిట్ అయిన ఆహార ఉత్పత్తిని అధికం చేసే వ్యూహాలు( స్ట్రాటజీస్ ఆఫ్ ఎన్హాన్స్ మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్) (STRATEGIES OF ENHANCEMENTS IN FOOD PRODUCTION) అనే చాప్టర్ నుండి కూడా కొన్ని అంశాలను తొలగించారు.

  ఇలా మూడు చాప్టర్ల నుండి అంశాలను తొలగించి.. విద్యార్ధులకు కొంత ఊరట కల్పించారు. ఇలా తగ్గించగా మిగిలిన వాటి నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇచ్చే అవకాశం ఉంది. కొంచెం ప్లాన్డ్ గా, జాగ్రత్తగా చదివితే.. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ప్లాన్డ్ గా చదవడం, ఆ చదివినదాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం, పరీక్షలో తడబాటు లేకుండా రాయడం కోసం.. చదివిన తర్వాత.. పేపర్ మీద ప్రెజెంట్ చేస్తే మంచిది. ప్రతీదీ ఎగ్జామ్స్ తరహాలో ముందునుండే ప్రాక్టీస్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.

  బోటరీ సెకండ్ ఇయర్ ప్రశ్నాపత్రంలో మొత్తం 60 మార్కులు ఉంటాయి. ఇందులో రెండు 8 మార్కుల ప్రశ్నలు రాయాల్సి ఉంది. మూడు ఇస్తారు. ఒక ఛాయిస్ ఉంటుంది. ఇక ఆరు 4 మార్కుల ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. 8 ప్రశ్నలు అడుగుతారు. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. పది 2 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పది ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ ఛాయిస్ ఉండదు.

  మొదట 8 మార్కుల ప్రశ్నలకు సంబంధించి ఒక ఛాయిస్ క్వశ్చన్ తో పాటు మొత్తం మూడు ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఇస్తారు. వీటిలో రెండు రాయాల్సి ఉంది. జాగ్రత్తగా చదివితే ఈ రెండు ప్రశ్నలు రాసేయవచ్చు. ప్రశ్నాపత్నంలో వచ్చే మూడు 8 మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే..

  మొదటి 8 మార్కుల ప్రశ్న, ఫస్ట్ యూనిట్ లోని మొక్కలలో శ్వాసక్రియ RESPIRATION OF PLANTS) అనే చాప్టర్ నుండి రావొచ్చు. మరో 8 మార్కుల ప్రశ్న ఐదవ యూనిట్ అయిన బయోటెక్నాలజీ లోని జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు, ప్రక్రియలు (PRINCIPLES & PROCESSES OF BIOTECHNOLOGY) నుండి రావొచ్చు. ఇక 8 మార్కుల ప్రశ్న 7వ యూనిట్ అయిన మనిషి సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు (PLANTS AND MICROBES IN HUMAN WELFARE) లోని.. 1వ చాప్టర్ అయిన ఆహార ఉత్పత్తిని అధికం చేసే వ్యూహాలు (STRATEGIES OF ENHANCEMENTS IN FOOD PRODUCTION) అనే చాప్టర్ నుండి రావొచ్చు.

  ప్రశ్నాపత్రంలో 4 మార్కుల ప్రశ్నలు 6 రాయాల్సి ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలు అడుగుతారు. రెండు ఛాయిస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ 4 మార్కుల ప్రశ్నలు.. 8 చాప్టర్ల నుండి ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ల నుండి ఒక్కొక్క 4 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ యూనిట్ లోని వ్ళక్ష శరీర ధర్మ శాస్త్రం (PLANT PHYSIOLOGY) లో 1. మొక్కలలో రవాణా (TRANSPORT IN PLANTS), ఎంజైమ్ లు (ENZYME), ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ (PHOTO SYNTHASIS IN HIGHER PLANTS), మొక్కలలో శ్వాసక్రియ (RESPIRATION OF PLANTS), మొక్క ఎదుగుదల & అభివ్ళద్ది (PLANT GROWTH & DEVELOPMENT) అనే చాప్టర్ల నుండి నాలుగు 4 మార్కుల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక రెండవ యూనిట్ సూక్ష్మజీవ శాస్త్రం (MICROBIOLOGY) లోని వైరసెస్ (VIRUSES) అనే చాప్టర్ నుండి మరో 4 మార్కుల ప్రశ్న వస్తుంది.

  మూడవ యూనిట్ జన్యుశాస్త్రం (GENETICS)లో అనువంశికతా సూత్రాలు, వైవిధ్యం (PRINCIPLES OF INHERITENCE & VARIATION) నుండి ఒక 4 మార్కుల ప్రశ్న వస్తుంది. నాల్గవ యూనిట్ మాలిక్యులర్ బయాలజీ లోని అణు జీవ శాస్త్రం (MOLECULAR BIOLOGY) లో అణుస్దాయి ఆధారిత అనువంశికత (MOLECULAR BIOLOGY OF INHERITENCE) నుండి మరో 4 మార్కుల ప్రశ్న వస్తుంది.

  ఐదవ యూనిట్ బయోటెక్నాలజీ ( BIOTECHNOLOGY) లోని జీవ సాంకేతిక శాస్త్రం అనువర్తనాలు (BIOTECHNOLOGY AND ITS APPLICATIONS), వ్యవసాయంలో జీవసాంకేతిక శాస్త్రం అనువర్తనాలు (BIOTECHNOLOGICAL APPLICATIONS OF AGRICULTURE) అనే రెండు చాప్టర్ల నుండి వస్తుంది.

  ఆరవ యూనిట్ అయిన మనిషి సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు (PLANTS AND MICROBES IN HUMAN WELFARE) లో 2వ చాప్టర్ అయిన మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు (MICROBES IN HUMAN WELFARE) మరో 4 మార్కుల ప్రశ్న వస్తుంది. మొత్తంగా ఫస్ట్ యూనిట్ నుండే నాలుగు 4 మార్కుల ప్రశ్నలు, మిగిలిన 4 చాప్టర్ల నుండి మరో నాలుగు 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి.

  ప్రధానంగా ఈ 4 మార్కుల ప్రశ్నల్లో రెండు ప్రశ్నలు మాత్రం కొంచెం వైవిద్యంగా అడగవచ్చు. ఏవైనా రెండు అంశాలు ఇచ్చి వాటిమధ్య తేడాలు(డిఫరెన్సెస్) ఏంటి? అని అడుగుతారు. ఉదాహరణకు డీఎన్ఏ, ఆర్ఎన్ఏ ల మధ్య తేడా ఏంటి? లాంటి ఒక ప్రశ్న రావొచ్చు. ఇక రెండవది క్లోరోప్లాస్ట్,(హరిత రేణువు) డయాగ్రామ్ విత్ లేబ్లింగ్ గీయమని అడగవచ్చు. కాబట్టి.. ఇలాంటి రెండు అంశాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

  రెండు మార్కు ప్రశ్నలకు సంబంధించి ప్రశ్నాపత్రంలో పది 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. పది కూడా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటిలో ఛాయిస్ ఉండదు. ఫస్ట్ యూనిట్ వ్ళక్ష శరీర ధర్మ శాస్త్రం (PLANT PHYSIOLGY) లోని మొక్కలలో రవాణా (TRANSPORT IN PLANTS), ఎంజైమ్ లు (ENZYME), ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ (PHOTO SYNTHASIS IN HIGHER PLANTS), మొక్కలలో శ్వాసక్రియ (RESPIRATION OF PLANTS), మొక్క ఎదుగుదల & అభివ్ళద్ది (PLANT GROWTH & DEVELOPMENT) అనే చాప్టర్ల నుండి రెండు ప్రశ్నలు వస్తాయి. ఇక రెండవ యూనిట్ సూక్ష్మజీవ శాస్త్రం (MICROBIOLOGY) లో బాక్టీరియా (BACTERIA) అనే చాప్టర్ నుండి ఒక 2 మార్కుల ప్రశ్న రావొచ్చు.

  మూడవ యూనిట్ జన్యుశాస్త్రం (GENETIC)లో అనువంశికతా సూత్రాలు, వైవిధ్యం (PRINCIPLES OF INHERITENCE & VARIATION) అనే చాప్టర్ నుండి ఒక 2 మార్కుల ప్రశ్న రావొచ్చు. ఇక నాల్గవ యూనిట్ అణు జీవ శాస్త్రం (MOLECULAR BIOLOGY) లో అణుస్దాయి ఆధారిత అనువంశికత (MOLECULAR BIOLOGY OF INHERITENCE) అనే చాప్టర్ నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు రావొచ్చు. ఇక ఐదవ యూనిట్ జీవ సాంకేతిక శాస్త్రం ( BIOTECHNOLOGY) లో జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు, ప్రక్రియలు (PRINCIPLES & PROCESSES OF BIOTECHNOLOGY), జీవ సాంకేతిక శాస్త్రం అనువర్తనాలు BIOTECHNOLOGY AND ITS APPLICATIONS) అనే రెండు చాప్టర్ల నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.

  ఆరవ యూనిట్ మనిషి సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు (PLANTS AND MICROBES IN HUMAN WELFARE) లో 2వ చాప్టర్ అయిన మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు (MICROBES IN HUMAN WELFARE) అనే చాప్టర్ నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు రావొచ్చు.

  ప్రశ్నాపత్రంలో ఇచ్చే మొత్తం సిలబస్ చూస్తే.. 1వ యూనిట్ నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు, నాలుగు 4 మార్కుల ప్రశ్నలు, ఒక 8 మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ చాప్టర్ జాగ్రత్తగా చదివితే.. 20 నుండి 22 మార్కులు స్కోర్ చేయొచ్చు.

  రెండవ యూనిట్ లో ఒక 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న రావచ్చు. మూడవ యూనిట్ లో కూడా ఒక 2 మార్కులు, ఒక 4 మార్కుల ప్రశ్న రావొచ్చు. ఇక 4 వ యూనిట్ లో రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న రావొచ్చు.

  ఐదవ యూనిట్ లోని రెండు చాప్టర్లు నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 8 మార్కుల ప్రశ్న రావొచ్చు. మొత్తంగా 16 మార్కులు స్కోర్ చేయొచ్చు. ఇక చివరిగా ఆరవ యూనిట్ నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 8 మార్కుల ప్రశ్న వస్తాయి. అంటే ఈ యూనిట్ నుండి 12 మార్కులు స్కోర్ చేయొచ్చు.

  కాబట్టి.. అత్యధిక మార్కులు వచ్చే 1, 5, 6 యూనిట్లను జాగ్రత్తగా చదివితే.. సులభంగా బోటనీ రెండవ సంవత్సరం పేపరును రాసి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams

  ఉత్తమ కథలు