AP INTER 1ST YEAR MATHS 1B PAPER ANDHRA PRADESH INTER FIRST YEAR MATHS 1B MODEL PAPER DOWNLOAD HERE VSP EVK
AP Inter 1st Year Maths 1B Paper: ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1బీ మోడల్ పేపర్.. డౌన్లోడ్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
AP Inter 1st Year Maths 1B Paper | ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అతి ముఖ్యమైన స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే అది మ్యాథమేటిక్స్ అనే చెప్పాలి. మొత్తం 150 మార్కులకు మాధమేటిక్స్ పేపర్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సిలబస్ ను 1A, 1B విభాగాలుగా విభజించారు. మ్యాథ్స్‌లో మంచి స్కోర్ చేయడానికి ఇంటర్ మ్యాథ్స్ 1B మోడల్ పేపర్‌ను న్యూస్ 18 అందిస్తోంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అతి ముఖ్యమైన స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే అది మాధమేటిక్స్ అనే చెప్పాలి. మొత్తం 150 మార్కులకు మాధమేటిక్స్ పేపర్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ మేధ్స్ సిలబస్ ను 1A, 1B విభాగాలుగా విభజించారు. ప్రశ్నాపత్రంలో కూడా 1Aలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు, 1Bలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కోవిడ్ కారణంగా 1A, 1B విభాగాల నుండి గత ఏడాది తగ్గించిన విధంగానే ఈ ఏడాది కూడా సుమారు 30 శాతం టాపిక్ లను, అందులోని సబ్ టాపిక్స్ ను తొలగించారు. అందువల్ల సిలబస్ నుండి తీసేసిన టాపిక్స్ మినహాయించి మిగిలిన అంశాల నుండే ఫస్ట్ ఇయర్ మాథమేటిక్స్ ప్రశ్నాపత్రం వస్తుంది.
ఇక 1B లో వచ్చే చాప్టర్లు, టాపిక్స్ విషయానికి వస్తే.. కోఆర్డినేట్ జామెట్రీ(COORDINATE GEOMETRY)లో LOCUS, THE STRAIGHT LINE, PAIR OF STRAIGHT LINES, THREE DIMENSIONAL COORDINATES, PLANE, DIRECTION COSINES AND DIRECTION RATIOS అనే టాపిక్స్ ఉంటాయి. ఇక కాల్కులస్ (CALCULUS) లో LIMITS AND CONTINUITY, DIFFERENTIATION, TANGENTS AND NORMALS, INCREASING AND DECREASING FUNCTIONS, MAXIMA AND MINIMA అనే టాపిక్స్ ఉంటాయి.
ఇందులో 1B లో వచ్చే 75 మార్కుల్లో 7 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. 2 ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. ఇక 4 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో ఐదు 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఇస్తారు. ఇక 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. ఒక్కొక్కటి 2 మార్కుల చొప్పున 20 మార్కులకు పది 2 మార్కుల ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఛాయిస్ ఉండదు.
ఇక 1Bలో ఉన్న చాప్టర్స్ నుండి వచ్చే ప్రశ్నలను చూస్తే... కోఆర్డినేట్ జామెట్రీ (COORDINATE GEOMETRY) లో LOCUS అనే టాపిక్ నుండి రెండు 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక THE STRAIGHT LINE అనే టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక PAIR OF STRAIGHT LINES నుంచి రెండు 7 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మరో టాపిక్ THREE DIMENSIONAL COORDINATES నుండి ఒక 2 మార్కుల ప్రశ్న వస్తుంది. ఇక PLANE నుండి ఒక 2 మార్కుల ప్రశ్న వస్తుంది. DIRECTION COSINES AND DIRECTION RATIOS నుండి ఒక 7 మార్కుల ప్రశ్న వస్తుంది.
మరొక పార్ట్ అయిన కాల్కులస్ (CALCULUS) లో LIMITS AND CONTINUITY అనే టాపిక్ నుండి ఒక 4 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక DIFFERENTIATION అనే టాపిక్ నుంచి ఒక 7మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మరో చాప్టర్ TANGENTS AND NORMALS నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. ఇక INCREASING AND DECREASING FUNCTIONS టాపిక్ నుండి ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. మరో టాపిక్ MAXIMA AND MINIMA నుండి ఒక 7 మార్కుల ప్రశ్న వస్తుంది.
ఇలా ఫస్ట్ ఇయర్ మాధమేటిక్స్ లో ప్లాన్డ్ గా చదివితే.. పరీక్ష మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 1B నుండి అతి సులువైన చాప్టర్స్, ఫిక్స్డ్ క్వశ్చన్స్ అలాగే రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే THE STRAIGHT LINE, PAIR OF STRAIGHT LINES, DIFFERENTIATION, TANGENTS AND NORMALS టాపిక్స్ నుండి 70 శాతం పైగా మార్కులు తెచ్చుకోవచ్చు.
ఇక మిగిలిన టాపిక్స్ లో కూడా ఫిక్స్ డ్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అనుభవజ్జులైన సబ్జెక్ట్ టీచర్లు చెబుతున్న ప్రకారం .. 1A కంటే.. 1B లోనే కొద్దిగా మార్కులు ఎక్కువగా మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. IA లో ఉండే సిలబస్ ఈజీగా ఉంటుందని విద్యార్ధులు భావిస్తారని, కానీ కాస్త ద్ళష్టి పెడితే.. 1B లో ఎక్కువ మార్కులు సాధించవచ్చని అంటున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.