హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter 1st Year Maths 1A Paper: ఎక్కువ స్కోర్‌కు చాన్స్ ఉన్న స‌బ్జెక్ట్‌.. ఏపీ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ మ్యాథ్స్ 1ఏ మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

AP Inter 1st Year Maths 1A Paper: ఎక్కువ స్కోర్‌కు చాన్స్ ఉన్న స‌బ్జెక్ట్‌.. ఏపీ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ మ్యాథ్స్ 1ఏ మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Inter 1st Year Maths 1A Paper | ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అతి ముఖ్యమైన స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే అది మ్యాథ‌మేటిక్స్ అనే చెప్పాలి. మొత్తం 150 మార్కులకు మాధమేటిక్స్ పేపర్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్‌ సిలబస్ ను 1A, 1B విభాగాలుగా విభజించారు. మ్యాథ్స్‌లో మంచి స్కోర్ చేయ‌డానికి ఇంట‌ర్ మ్యాథ్స్ 1A మోడల్ పేపర్‌ను న్యూస్ 18 అందిస్తోంది.

ఇంకా చదవండి ...

సేకరణ: ఆనంద్ మోహన్, విశాఖ‌ప‌ట్నం

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అతి ముఖ్యమైన స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే అది మాధమేటిక్స్ అనే చెప్పాలి. మొత్తం 150 మార్కులకు మ్యాథ‌మేటిక్స్పేపర్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సిలబస్ ను 1A, 1B విభాగాలుగా విభజించారు. ప్రశ్నాపత్రంలో కూడా 1Aలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు, 1Bలో ఉన్న చాప్టర్ల నుంచి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కోవిడ్ కారణంగా 1A, 1B విభాగాల నుండి గత ఏడాది తగ్గించిన విధంగానే ఈ ఏడాది కూడా సుమారు 30 శాతం టాపిక్ లను, అందులోని సబ్ టాపిక్స్ ను తొలగించారు. అందువల్ల సిలబస్ నుండి తీసేసిన టాపిక్స్ మినహాయించి మిగిలిన అంశాల నుండే ఫస్ట్ ఇయర్ మాథమేటిక్స్ ప్రశ్నాపత్రం వస్తుంది.

1A లో ఆల్ జీబ్రా (ALGEBRA) లో FUNCTIONS, MATRICES అనే టాపిక్స్ ఉంటాయి. ఇక వెక్టర్ ఆల్ జీబ్రా (VECTOR ALGEBRA) లో ADDITION OF VECTORS, MULTIPLICATION OF VECTORS అనే టాపిక్స్ ఉంటాయి. ఇక ఈ ఆల్ జీబ్రా నుండి MATHEMATICAL INDUCTION ఇక టాపిక్ ను సిలబస్ నుండి  తొలగించారు.

ఇక త్రికోణమితి(TRIGONOMETRY) లో TRIGONAMATRIC RATIOS UP TO TRANSFORMATIONS, HYPER BOLIC FUNCTIONS, PEOPERTIES OF TRAINGLES అనే టాపిక్స్ ఉంటాయి. ఇక ఈ చాప్టర్ నుండి TRIGONOMETRIC EQUATIONS, INVERSE TRIGONOMETRIC FUNCTIONS అనే టాపిక్స్ ను సిలబస్ నుండి తొలగించారు.

ఇందులో 1A లో వచ్చే 75 మార్కుల్లో 7 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. 2 ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. ఇక 4 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో ఐదు 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఇస్తారు. ఇక 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. వీటికి ఛాయిస్ ఉండదు.

మొదట 1A లో 75 మార్కులకు వచ్చే ప్రశ్నాపత్రాన్ని చూస్తే.. ఆల్ జీబ్రాలోని FUCNTIONS అనే టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. రెండవ టాపిక్ మేట్రిసెస్ (MATRICES) నుండి రెండు 7 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక వెక్టర్ ఆల్ జీబ్రా (VECTOR ALGEBRA) లో ADDITION OF VECTORS అనే టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. MULTIPLICATION OF VECTORS అనే టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. ఇక 1Aలో ఉన్న మరో చాప్టర్ త్రికోణమితి(TRIGONOMETRY)లో ఉన్న TRIGONAMATRIC RATIOS UP TO TRANSFORMATIONS అనే టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, మూడు 4 మార్కుల ప్రశ్నలు, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.

ఇక రెండవ టాపిక్ HYPERBOLIC FUNCTIONS నుండి ఒక 2 మార్కుల ప్రశ్న మాత్రమే వస్తుంది. చివరి టాపిక్ PEOPERTIES OF TRAINGLES నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 4మార్కుల ప్రశ్న వస్తాయి. మొత్తంగా 75 మార్కుల ప్రశ్నాపత్రం ఈ టాపిక్స్ నుండి ప్రశ్నలు వచ్చే అవకాశముంది.

ఇలా ఫస్ట్ ఇయర్ మాధమేటిక్స్ లో ప్లాన్డ్ గా చదివితే.. పరీక్ష మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అతి సులువైన చాప్టర్స్ అయిన మేట్రిసెస్, TRIGONAMATRIC RATIOS UP TO TRANSFORMATIONS టాపిక్స్ ను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే.. 1A నుండి సగానికి పైగా మార్కులు తెచ్చుకోవచ్చు. మార్కుల్లో ఉన్న మూడు చాప్టర్లో రెండు టాపిక్ లను పూర్తిగా చదివితే.. ఫస్టయర్ మేధ్స్ పేపర్ లో మంచి మార్కులు సాధించవచ్చు. ఇక మిగిలిన టాపిక్స్ లో కూడా ఫిక్స్ డ్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అనుభవజ్జులైన సబ్జెక్ట్ టీచర్లు చెబుతున్నారు. సో.. స్టూడెంట్స్.. ఆల్ ది బెస్ట్..  .

First published:

Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses

ఉత్తమ కథలు