హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter 1st Year Botany Model Paper-1: ఏపీ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ బోట‌నీ సిల‌బ‌స్‌.. మోడ‌ల్ పేప‌ర్ డోన్‌లోడ్ చేసుకోండి

AP Inter 1st Year Botany Model Paper-1: ఏపీ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ బోట‌నీ సిల‌బ‌స్‌.. మోడ‌ల్ పేప‌ర్ డోన్‌లోడ్ చేసుకోండి

AP Inter 1st Year Botany Model Paper-1 | బైపీసీ చ‌దువుతున్న విద్యార్థులు బోట‌నీలో మంచి స్కోర్ సాధించాలని చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు. వారి కోసం ఇంట‌ర్ ఫస్ట్ ఇయ‌ర్ బోట‌నీ ప‌రీక్ష‌లో వ‌చ్చే సెల‌బ‌స్‌, స్కోరింగ్ ఎలా చేయొచ్చో ఏ చాప్ట‌ర్ నుంచి ఎన్ని ప్ర‌శ్న‌లు వ‌స్తాయో తెలిపేలా న్యూస్ 18 ప్ర‌త్యేక మోడ‌ల్ పేప‌ర్ అందిస్తోంది. ఆల్ ది బెస్ట్‌

AP Inter 1st Year Botany Model Paper-1 | బైపీసీ చ‌దువుతున్న విద్యార్థులు బోట‌నీలో మంచి స్కోర్ సాధించాలని చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు. వారి కోసం ఇంట‌ర్ ఫస్ట్ ఇయ‌ర్ బోట‌నీ ప‌రీక్ష‌లో వ‌చ్చే సెల‌బ‌స్‌, స్కోరింగ్ ఎలా చేయొచ్చో ఏ చాప్ట‌ర్ నుంచి ఎన్ని ప్ర‌శ్న‌లు వ‌స్తాయో తెలిపేలా న్యూస్ 18 ప్ర‌త్యేక మోడ‌ల్ పేప‌ర్ అందిస్తోంది. ఆల్ ది బెస్ట్‌

AP Inter 1st Year Botany Model Paper-1 | బైపీసీ చ‌దువుతున్న విద్యార్థులు బోట‌నీలో మంచి స్కోర్ సాధించాలని చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు. వారి కోసం ఇంట‌ర్ ఫస్ట్ ఇయ‌ర్ బోట‌నీ ప‌రీక్ష‌లో వ‌చ్చే సెల‌బ‌స్‌, స్కోరింగ్ ఎలా చేయొచ్చో ఏ చాప్ట‌ర్ నుంచి ఎన్ని ప్ర‌శ్న‌లు వ‌స్తాయో తెలిపేలా న్యూస్ 18 ప్ర‌త్యేక మోడ‌ల్ పేప‌ర్ అందిస్తోంది. ఆల్ ది బెస్ట్‌

ఇంకా చదవండి ...

  సేకరణ: భాను ప్రసాద్, న్యూస్18 కరస్పాండెంట్, విజయనగరం

  ర‌చ‌యిత: కృష్ణ‌మూర్తి నాయుడు, బోటనీ లెక్చ‌ర‌ర్‌, విజ‌య‌న‌గ‌రం

  ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలోని బోటనీ (BOTANY) సిలబస్ లో మొత్తం 7 యూనిట్లు ఉంటాయి.  1) ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిద్యం (డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్) (DIVERSITY IN THE LIVING WORLD) లో 4 చాప్టర్లు ఉంటాయి. ఇందులో జీవ ప్రపంచం (ది లివింగ్ వరల్డ్) (the living world),జీవశాస్త్ర వర్గీకరణ (బయలాజికల్ క్లాసిఫికేషన్) (biological classification), మొక్కల విజ్ఝానం-వ్ళక్ష శాస్త్రం ( సైన్స్ ఆఫ్ ప్లాంట్స్-బోటనీ) (science of plants- botany), వ్ళక్ష రాజ్యం(ప్లాంట్ కింగ్ డమ్) (plant kingdom) అనే చాప్టర్లు ఉంటాయి. 2) రెండవ యూనిట్ లో మొక్కల నిర్మాణాత్మక సంవిధానం (స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ మార్ఫాలజీ) (STRUCTURAL ORGANISATION IN PLANTS MORPHOLOGY) అనే ఒక చాప్లర్ మాత్రమే ఉంది.

  3)మూడవ యూనిట్ లో మొక్కలలో పునరుత్పత్తి (రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్) (Reproduction in plants) లో పుష్పించే మొక్కలలో లైంగిక పునరుత్పత్తి (సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ (sexuals reproduction in flowering plants) అనే చాప్టర్లు ఉన్నాయి. 4) నాల్గవ యూనిట్ లో మొక్కల సిస్టమాటిక్స్ (ప్లాంట్స్ సిస్టమేటిక్స్) (PLANT SYSTEMATICS) లో ఆవ్ళత బీజాల యొక్క వర్గీకరణ (టాక్సోనమీ ఆఫ్ ఆంగ్లో స్పెర్మ్స్) (Taxonomy of anglosperms) అనే చాప్లర్లు ఉన్నాయి. 5) ఐదవ యూనిట్ లో కణం నిర్మాణం మరియు విధులు( సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్) (CELL STRUCTURE AND FUNCTION) లో కణం-జీవ ప్రమాణం (సెల్-యూనిట్ ఆఫ్ లైఫ్) (cell-the unit of life), జీవ అణువులు (బయోమాలిక్యూల్స్) (biomolecules), కణ చక్రం-కణ విభజన (సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్) (cell cycle and cell division) అనే చాప్టర్లు ఉన్నాయి.

  6)ఆరవ యూనిట్ లో మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం (ఇంటర్నల్ ఆర్గనైజషన్ ఆఫ్ ప్లాంట్స్)( INTERNAL ORGANISATION OF PLANTS) లో పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం (హిస్టోలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్) (Histolgy and anatomy of flowering plants) అనే ఒక చాప్టర్ మాత్రమే ఉంది. 7)ఏడవ యూనిట్ లో వ్ళక్ష ఆవరణ శాస్త్రం (ప్లాంట్ ఎకాలజీ) (PLANT ECOLOGY) అనే చాప్టర్ లో ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు (ఎకాలాజికల్ అడాప్టేషన్స్, సక్సెషన్ అండ్ ఎకాలాజికల్ సర్వీసెస్) (Ecological Adaptations, Succession and Ecological Services) అనే చాప్లర్లు ఉన్నాయి. ఇలా ఏడు యూనిట్ల నుండి 13 చాప్టర్లు ఉన్నాయి.

  కోవిడ్ కారణంగా గత ఏడాది ఫస్ట్ ఇయర్ బోటనీ పేపర్ లో కొంత సిలబస్ తగ్గించడం జరిగింది. ఈ ఏడాది కూడా 30 శాతం మేర సిలబస్ తగ్గించారు. మొత్తం ఏడు యూనిట్లలో మూడవ యూనిట్ లోని మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ (MODES OF REPRODUCTION) అనే చాప్టర్ ను పూర్తిగా తొలగించారు. మిగిలిన అన్ని చాప్టర్స్ నుండి కొన్నికొన్ని అంశాలను తగ్గించారు. ఇలా తగ్గించగా మిగిలిన వాటి నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇచ్చే అవకాశం ఉంది.

  కొంచెం ప్లాన్డ్ గా, జాగ్రత్తగా చదివితే.. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ప్లాన్డ్ గా చదవడం, ఆ చదివినదాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం, పరీక్షలో తడబాటు లేకుండా రాయడం కోసం.. చదివిన తర్వాత.. పేపర్ మీద ప్రెజెంట్ చేస్తే మంచిది. ప్రతీదీ ఎగ్జామ్స్ తరహాలో ముందునుండే ప్రాక్టీస్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.

  బోటరీ ఫస్ట్ ఇయర్ ప్రశ్నాపత్రంలో మొత్తం 60 మార్కులు ఉంటాయి. ఇందులో రెండు 8 మార్కుల ప్రశ్నలు రాయాల్సి ఉంది. మూడు ఇస్తారు. ఒక ఛాయిస్ ఉంటుంది. ఇక ఆరు 4 మార్కుల ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. 8 ప్రశ్నలు అడుగుతారు. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. పది 2 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పది ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ ఛాయిస్ ఉండదు.

  మొదట 8 మార్కుల ప్రశ్నలకు సంబంధించి ఒక ఛాయిస్ క్వశ్చన్ తో పాటు మొత్తం మూడు ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఇస్తారు. వీటిలో రెండు రాయాల్సి ఉంది. జాగ్రత్తగా చదివితే ఈ రెండు ప్రశ్నలు రాసేయవచ్చు. ప్రశ్నాపత్నంలో వచ్చే మూడు 8 మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే.. రెండవ యూనిట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం (STRUCTURAL ORGANISATION IN PLANTS MORPHOLOGY)లో ఉన్న ఒకే ఒక్క చాప్లర్ నుండి, మూడవ యూనిట్ అయిన మొక్కలలో పునరుత్పత్తి (Reproduction in plants) నుంచి రెండవ చాప్టర్ అయిన పుష్పించే మొక్కలలో లైంగిక పునరుత్పత్తి (sexuals reproduction in flowering plants) చాప్టర్ నుండి, ఆరవ యూనిట్ మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం (INTERNAL ORGANISATION OF PLANTS) లోని పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం (Histolgy and anatomy of flowering plants) అనే ఒకే ఒక్క చాప్టర్ నుండి మరో 8 మార్కుల ప్రశ్న వస్తుంది. కాబట్టి.. ఈ మూడు చాప్టర్లు చదివితే.. రెండవ 8 మార్కుల ప్రశ్నలు రాసేయవచ్చు. ముఖ్యంగా ఇచ్చే మూడు ప్రశ్నలలో ఒక 8 మార్కుల ప్రశ్న రెండుగా ఇవ్వొచ్చు. ఒక 6 మార్కుల ధియరీ ప్రశ్న, ఒక 2 మార్కుల డయాగ్రామ్, లేబ్లింగ్ ప్రశ్న ఉంటాయి. కాబట్టి ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి.

  ప్రశ్నాపత్రంలో 4 మార్కుల ప్రశ్నలు 6 రాయాల్సి ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలు అడుగుతారు. రెండు ఛాయిస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ 4 మార్కుల ప్రశ్నలు.. 8 చాప్టర్ల నుండి ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ల నుండి ఒక్కొక్క 4 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ యూనిట్ అయిన జీవ ప్రపంచ వైవిద్యం (DIVERSITY IN THE LIVING WORLD) లోని రెండవ చాప్టర్ అయిన జీవశాస్త్ర వర్గీకరణ  (biological classification), నాల్గవ చాప్టర్ వ్ళక్ష రాజ్యం (plant kingdom) ల నుండి రెండు 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక మూడవ యూనిట్ అయిన మొక్కలలో పునరుత్పత్తి (Reproduction in plants) నుండి రెండవ చాప్టర్ అయిన పుష్పించే మొక్కలలో లైంగిక పునరుత్పత్తి (sexuals reproduction in flowering plants) చాప్టర్ నుండి వస్తుంది. ఇక నాల్గవ యూనిట్ మొక్కల సిస్టమాటిక్స్ (PLANT SYSTEMATICS)లో ఉన్న ఒకేఒక్క చాప్టర్ ఆవ్ళత బీజాల యొక్క వర్గీకరణ (Taxonomy of anglosperms) నుండి వస్తుంది.

  ఐదవ యూనిట్ అయిన కణం నిర్మాణం మరియు విధులు (CELL STRUCTURE AND FUNCTION) నుండి ఉన్న కణం-జీవ ప్రమాణం (cell-the unit of life), జీవ అణువులు (biomolecules), కణ చక్రం-కణ విభజన (cell cycle and cell division) అనే మూడు చాప్టర్ల నుండి మూడు 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక మరో 4 మార్కుల ప్రశ్న ఏడవ యూనిట్ అయిన వ్ళక్ష ఆవరణ శాస్త్రం (PLANT ECOLOGY) లో ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు (Ecological Adaptations, Succession and Ecological Services) అనే చాప్లర్ నుండి వస్తుంది. మొత్తంగా 1వ యూనిట్ లో రెండు, 2వ యూనిట్ లో ఒకటి, 3వ యూనిట్ లో ఒకటి, 4వ యూనిట్ లో ఒకటి, 5వ యూనిట్ లో మూడు, 7వ యూనిట్ లో ఒకటి వస్తాయి. కాబట్టి పైన ఇచ్చిన యూనిట్లు, వాటి లోని చాప్టర్లను చదివితే. ఆరు 4 మార్కుల ప్రశ్నలు కూడా రాసేయవచ్చు.

  ప్రధానంగా ఈ 4 మార్కుల ప్రశ్నల్లో రెండు ప్రశ్నలు మాత్రం కొంచెం వైవిద్యంగా అడగవచ్చు. ఏవైనా రెండు అంశాలు ఇచ్చి వాటిమధ్య తేడాలు(డిఫరెన్సెస్) ఏంటి? అని అడగొచ్చు. ఇలా అడుగుతారని భావించే ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు ఇలా ఉండొచ్చు. ఆర్ఈఆర్, ఎస్ఈఆర్ మధ్య తేడా ఏంటి? రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే మధ్య తేడా ఏంటి? లివర్ వర్డ్స్, మాసెస్ మధ్యలో తేడా ఏంటి? యాక్టివ్ ట్రాన్స్ పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్ పోర్ట్ ల మధ్య తేడా ఏంటి? అనే ప్రశ్నలు రావొచ్చు. కాబట్టి.. ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

  ఇక రెండు మార్కు ప్రశ్నలకు సంబంధించి ప్రశ్నాపత్రంలో పది 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. పది కూడా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటిలో ఛాయిస్ ఉండదు. ప్రధానంగా ఫస్ట్ యూనిట్ అయిన జీవ ప్రపంచ వైవిద్యం (DIVERSITY IN THE LIVING WORLD) లోని .. జీవ ప్రపంచం (ది లివింగ్ వరల్డ్) (the living world), జీవశాస్త్ర వర్గీకరణ (బయలాజికల్ క్లాసిఫికేషన్) (biological classification), మొక్కల విజ్ఝానం-వ్ళక్ష శాస్త్రం (సైన్స్ ఆఫ్ ప్లాంట్స్-బోటనీ) (science of plants- botany) అనే మూడు చాప్టర్ల నుండి మూడు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.

  రెండవ యూనిట్ అయిన మొక్కల నిర్మాణాత్మక సంవిధానం (STRUCTURAL ORGANISATION IN PLANTS MORPHOLOGY) నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక నాల్గవ యూనిట్ లో మొక్కల సిస్టమాటిక్స్ (PLANT SYSTEMATICS) లో ఆవ్ళత బీజాల యొక్క వర్గీకరణ (Taxonomy of anglosperms) నుండి వస్తుంది. ఇక ఐదవ యూనిట్ లోని కణం నిర్మాణం మరియు విధులు (CELL STRUCTURE AND FUNCTION) లోని.. కణం-జీవ ప్రమాణం (cell-the unit of life), జీవ అణువులు (biomolecules), కణ చక్రం-కణ విభజన (cell cycle and cell division) అనే మూడు చాప్టర్ల నుండి మూడు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.

  ఏడవ యూనిట్ అయిన వ్ళక్ష ఆవరణ శాస్త్రం (PLANT ECOLOGY)లోని ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు (Ecological Adaptations, Succession and Ecological Services) అనే చాప్టర్ నుండి మరో ప్రశ్న వస్తుంది. మొత్తంగా 1వ యూనిట్ నుండి మూడు, 2వ యూనిట్ నుండి రెండు, 4వ యూనిట్ నుండి ఒకటి, 5వ యూనిట్ నుండి మూడు, 7వ యూనిట్ నుండి ఒక ప్రశ్న వస్తాయి. కాబట్టి పైన ఇచ్చిన యూనిట్లు, వాటి లోని చాప్టర్లను చదివితే.. పది 2 మార్కుల ప్రశ్నలు కూడా రాసేయవచ్చు.

  ప్రశ్నాపత్రంలో ఇచ్చే మొత్తం సిలబస్ చూస్తే.. 1వ యూనిట్ నుండి మూడు 2 మార్కుల ప్రశ్నలు, రెండు నాలుగు మార్కుల ప్రశ్నలు వస్తాయి. మొత్తం ఈ చాప్టర్ జాగ్రత్తగా చదివితే.. 14 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇలా రెండవ యూనిట్ లో రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 8 మార్కుల ప్రశ్న మొత్తంగా 12 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక మూడవ యూనిట్ లో ఒక 4 మార్కులు, ఒక 8 మార్కుల ప్రశ్న మొత్తంగా 12 మార్కులు తెచ్చుకోవచ్చు. 4 వ యూనిట్ లో ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న వస్తాయి. ఐదవ యూనిట్ నుండి మూడు 2 మార్కుల ప్రశ్నలు, మూడు 4 మార్కుల ప్రశ్నలు మొత్తంగా 18 మార్కులు, ఆరవ యూనిట్ నుండి ఒక 8 మార్కుల ప్రశ్న అంటే 8 మార్కులు, ఏడవ యూనిట్ నుండి ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న మొత్తంగా 6 మార్కులు వస్తాయి.

  కాబట్టి, 1,2,3,5 వ యూనిట్లను జాగ్రత్తగా చదివితే.. సులభంగా బోటనీ మొదటి సంవత్సరం పేపరును మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.

  First published:

  Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams

  ఉత్తమ కథలు