Home /News /jobs /

AP ICET PREPARATION TIPS IF YOU READ THIS YOU CAN GET GOOD MARKS AND KNOW TOPIC WISE DETAILS GNT VB

AP ICET Preparation Tips: ఏపీ ఐసెట్ ప్రిపరేషన్ టిప్స్.. ఇలా చదివితే మంచి మార్కులు సాధించే అవకాశం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP ICET Preparation Tips : ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఇక్కడ చెప్పే టిప్స్ ను పాటిస్తే మంచి మార్కులు సాధించవచ్చు. అంతే కాకుండా పరీక్ష హాల్లో సమయాన్ని ఆదా చేసుకోవడం ఎలానో ఐసెట్ ఫ్యాకల్టీ సుప్రియ తెలియజేశారు. దాని గురించి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  (Anna Raghu, News18, Guntur) 

  సాధరణంగా ఐసెట్(AP ICET)  200 మార్కులకు పేపర్ ఉంటుంది. పరీక్షా సమయం 150 నిమిషాలు. ఇందులో సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3 ఉంటాయి. సెక్షన్ 1లో లాజికల్ రీజనింగ్, సెక్షన్ 2లో మ్యథ్స్, సెక్షన్ 3లో వెర్బల్ ఎబిలిటీ ఉంటాయి. ఇవి కూడా వివిధ మోడళ్లను అనుసరించి ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి.  ఇక సెక్షన్ ఒకటి నుంచీ లాజికల్ రీజనింగ్(Logical Reasoning) ఉంటుంది. ఇందులో డేటా సఫిషియన్సీ(Data Sufficiency), 1 నుంచీ 20 ప్రశ్నలు ఉంటాయి. ఇవి కాస్త టఫ్. తర్వాత నంబర్ సిరీస్ అనాలజీ  నుంచీ 15 ప్రశ్నలు వస్తాయి. వీటిలో కనీసం 10 మార్కులు వచ్చేయస్తాయి. వీటి తర్వాత ఫెటన్ సిరీస్, అనాలజీ నుంచీ కూడా ఇదే విధంగా ఉంటుంది. తర్వాత Odd Man Out నుంచి పది మార్కులకి ప్రశ్నలు ఉంటాయి. అలాగే కోడింగ్ డి కోడింగ్ (Coding) నుంచీ కూడా 10 మార్కులు వస్తాయి. డేటా అనాలసిస్ వరకూ 10 మార్కులు. ఇక బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, క్లాక్స్, కేలండర్స్ వరకూ అన్నీ కూడా 15 మార్కులను కవర్ అవుతాయి.

  Typist-Copyist Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో హైకోర్ట్‌ లో టైపిస్ట్, Copyist పోస్టులకు నోటిఫికేషన్..


  ఇక సెక్షన్ 2లో మ్యాథ్స్ ఉంటుంది. అర్థమెటిక్ 35 ప్రశ్నలు, ప్యూర్ మ్యాథ్స్ 10 మార్కులు, స్టాటస్టిక్స్ అండ్ ప్రొబబిలిటీ నుంచీ 10 మార్కులకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఈ మూడు సరిగ్గా చదవగలిగితే ఆల్మోస్ట్ 55 నుంచి 40 మార్కులు ఇక్కడ నుంచి పొందవచ్చు.  ఒకవేళ వీటిలో కష్టమైనవి కనిపిస్తే మాత్రం వదిలేయడం బెటర్. బాగా తెలిసినప్పుడు మాత్రం వీటిని ఎటెంప్ట్ చేయాలి. ఇక సెక్షన్ 3 నుంచీ వెర్బల్ ఎబిలిటీ నుంచీ ఉంటాయి. వీటిలో వొకాబులరీ, రీడింగ్ పేసేజ్, మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. అంటే vocabulary నుంచి 15, reading comprehension నుంచి 20 మార్కుల ప్రశ్నలు వస్తాయి. తర్వాత ఫంక్షనల్ గ్రామర్, 20 ప్రశ్నలు, కంప్యూటర్ బిజినెస్ టెర్మినాలజీ నుంచీ 20. మొత్తం కలిపి 35 ప్రశ్నలు ఉంటాయి. వీటిని పక్కాగా ఎటెంప్ట్ చేయగలిగితే మంచి ర్యాంకు సాధించినట్టే.  ఇక టైం గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ప్రధానంగా సెక్షన్ 1 కి 50 నిమిషాలు సమయం ఇవ్వాలి. తర్వాత సెక్షన్ 2 కి 60 నిమిషాలు ఇవ్వాలి. తర్వాత ఇంగ్లిష్ కి 30 నిమిషాలు ఇవ్వాలి. అలాగే మిగతా అంతా కవర్ చేయడానికి 10నిమిషాలు సరిపోతాయి. సెట్ పరీక్షకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది విద్యార్ధులకు చాలా పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి మీ మొత్తం ఎంపికలు అయిపోయిన తర్వాత చివరి పది నిమిషాలు ఏదో ఒక ప్రశ్నకి.. సమాధానం ఇచ్చే వదిలేయాలి. ఐసెట్‌ పరీక్షకు ఎలాంటి నెగిటివ్‌ మార్కింగ్ లేదు.

  Indian Navy Recruitment: అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. మహిళలకు కూడా అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు..


  కనుక మొదటి 5 నిముషాల్లో క్వశ్చన్‌ పేపర్‌ను పూర్తిగా చదివి.. క్విక్‌ ఆన్సర్స్‌ మార్క్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ ప్రశ్నలకు ఎంత టైం కేటాయించాలి అన్న విషయం విద్యార్థులకు అర్ధం అవుతుంది. మీకు వచ్చిన సమాధానాలు అన్ని పూర్తి చేసిన తర్వాతే.. మిగిలిన వాటికి ఆన్సర్స్ రాస్తే అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంతలో ఆఖరి 15 నిమిషాలు .. తప్పులు సరిదిద్దుకోవటంలో కేటాయించాలంటున్నారు. పరీక్షకు ముందు ఎలాంటి కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకూడదు. బేసిక్ మ్యాథమెటిక్స్ మీద షార్ట్‌కట్స్ ఎక్కువగా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఓల్డ్ పేపర్స్ రివిజన్ బాగా సహాయపడుతుంది. టైమర్ సెట్ చేసుకొని పాత పేపర్స్ పైన ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో సులువుగా ఉంటుందని ఐ సెట్ ఫ్యాకల్టీ సుప్రియ విద్యార్థులకు సూచించారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Andhra Pradesh, Ap icet, Career and Courses, Icet preparation, JOBS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు