హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs: ఇంటర్ పూర్తి చేశారా.. అయితే ఈ ఉద్యోగాలు మీ కోసమే.. దరఖాస్తు చేసుకోండిలా..

Andhra Pradesh Jobs: ఇంటర్ పూర్తి చేశారా.. అయితే ఈ ఉద్యోగాలు మీ కోసమే.. దరఖాస్తు చేసుకోండిలా..

Andhra Pradesh Jobs: ఇంటర్ పూర్తి చేశారా.. అయితే ఈ ఉద్యోగాలు మీ కోసమే.. దరఖాస్తు చేసుకోండిలా..

Andhra Pradesh Jobs: ఇంటర్ పూర్తి చేశారా.. అయితే ఈ ఉద్యోగాలు మీ కోసమే.. దరఖాస్తు చేసుకోండిలా..

ఏపీ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దీనిలో ఎగ్జామినర్ (Examiner) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 112 పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఏపీ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దీనిలో ఎగ్జామినర్ (Examiner) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 112 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జిల్లా కోర్డుల్లో(District Courts) ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు.

ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి. 

1. అనంతపురం-09

2.చిత్తూరు- 10

3.తూర్పు గోదావరి -11

4.గుంటూరు - 10

5.వైఎస్ఆర్ కడప-08

6. కృష్ణ - 17

7.కర్నూలు - 07

8. నెల్లూరు - 02

9.ప్రకాశం - 06

10. శ్రీకాకులం - 10

11.విశాఖపట్నం - 12

12.విజయనగరం - 02

13. పశ్చిమగోదావరి - 08

మొత్తం - 112

ముఖ్యమైన తేదీలు..

-దరఖాస్తులు ప్రారంభ తేదీ 22-10-2022

-దరఖాస్తులకు చివరి తేదీ 11-11-2022

అర్హతలు

అభ్యర్థులకు తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అనంతపురం వాసులకు తెలుగు, కన్నడ భాష వచ్చి ఉండాలి. శ్రీకాకులం, విజయనగం జిల్లా అభ్యర్థులకు తెలుగు, ఒరియా వచ్చి ఉండాలి.

దీంతో పాటు.. అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు.

ఎంపిక ఇలా..

అభ్యర్థులకు ఆన్ లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులకు.. 90 నిమిషాల్లో మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. వీటిలొ మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు తదుపరి దశకు పిలుస్తారు. ఈ రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హత సాధిస్తారు. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు 30 శాతం మార్కులు సాధిస్తే చాలు.

దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.

CAT: క్యాట్‌ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ మీ టార్గెటా..? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ ప్రిపరేషన్ ఇలా..

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

-దీనిలో నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని అర్హతలను చెక్ చేసుకోవాలి.

-వాటికి అర్హులుగా ఉంటే.. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

-వెబ్ సైట్ లో అప్లై ఆన్ లైన్ అనే ఆప్షన్ ను ఎంచుకొని వివరాలను నమోదు చేయాలి.

-చివరగా దరఖాస్తు చేసుకున్న ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి.

నోటిఫికేషన్ PDF కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

IGNOU Admissions 2022: ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు మరోసారి పెంపు.. ఎప్పటివరకంటే..

దరఖాస్తుల సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే.. 0863-2372752 నంబర్ కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ మెయిల్ ఐడీ helpdesk-hc.ap@aij.gov.in కూడా సంప్రదించవచ్చు.

First published:

Tags: Ap jobs, Career and Courses, JOBS

ఉత్తమ కథలు