హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs: ఈ ఉద్యోగాల భర్తీకి బ్రేకులు.. హైకోర్టు కీలక ఉత్తర్వులు!

Jobs: ఈ ఉద్యోగాల భర్తీకి బ్రేకులు.. హైకోర్టు కీలక ఉత్తర్వులు!

ఆ ఉద్యోగాల భర్తీకి హైకోర్టు బ్రేకులు!

ఆ ఉద్యోగాల భర్తీకి హైకోర్టు బ్రేకులు!

Government Jobs | ఏపీ ప్రభుత్వం చేపట్టిన అంగన్‌వాడీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 నియామకాలను అడ్డుకట్ట పడింది. హైకోర్టు తాజాగా ఈ నియామకాలను ఆపేయాలంటూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  AP Jobs | రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపడుతున్న ఎక్స్‌టెన్ష్ ఆఫీసర్స్ నియామకాలకు అడ్డుకట్ట పడింది. హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 నియామకాల ప్రక్రియను ఆపేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల్లో అవకతవకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఇందుకు కారణం.

  అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే అర్హులైన కాంట్రాక్ట్‌ వర్కర్లు, సూపర్‌వైజర్లతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హత మినిమమ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏకంగా 38 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు రాత పరీక్షలు కూడా రాశారు. అయితే కొంత మందిని మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కొంత మంది ఆభ్యర్థులు హైకోర్టు తలుపు తట్టారు.

  పీపీఎఫ్, సుకన్య సమృద్ధి స్కీమ్స్‌లో డబ్బులు పెట్టే వారికి కేంద్రం షాక్

  వీళ్లు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. నిబంధనల ప్రకారం చూస్తే.. 50 మార్కులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది జడ శ్రవన్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ 50 మార్కుల్లో 45 మార్క్‌లకు రాత పరీక్ష ఉంటుంది. మిగిలిన ఐదు మార్కకులకు మౌఖిక పరీక్ష నిర్వహించాలి.

  మధ్యతరగతికి మోదీ అదిరిపోయే శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి..

  రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పోస్టులకు రాత పరీక్షను నిర్వహించింది. ఈ నెల 18న రాత పరీక్ష జరిగింది. అయితే మౌఖిక పరీక్ష జరగాల్స ఉంది. అయితే మౌఖిక పరీక్ష లేకుండానే అంటే ఈ పరీక్షను నిర్వహించకుండానే కొంత మందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారని న్యాయ వాది కోర్టుకు తెలియజేశారు.

  అందువల్ల నియమకాల్లో అవకతవకలు జరిగాయని న్యాయవాది తెలిపారు. న్యాయ వాది వాదనను విన్న ధర్మాసనం నియామకాలను నిలిపివేయాలంటే మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 నియామకాలకు అడ్డుకట్ట పడిందని చెప్పుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Andhra Pradesh Government Jobs, AP Government Jobs, Ap jobs

  ఉత్తమ కథలు