హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో క్లర్క్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో క్లర్క్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

4. అంతే కాకుండా ఆ పోలీస్ అధికారిని బార్ అసోసియేషన్‌కు ఓ వంద కూల్‌డ్రింక్ టిన్నులను పంపిణీ చేయాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉం టుందని అన్నారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

4. అంతే కాకుండా ఆ పోలీస్ అధికారిని బార్ అసోసియేషన్‌కు ఓ వంద కూల్‌డ్రింక్ టిన్నులను పంపిణీ చేయాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉం టుందని అన్నారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

AP High Court Law Clerk Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. లా క్లర్క్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల (AP High Court Jobs) భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. లా క్లర్క్ (Law Clerk Jobs) పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఏపీ హైకోర్టు. మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి. నియామక ప్రక్రియ పూర్తయ్యే నాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులకు అసిస్టెంట్స్‌గా లా క్లర్క్స్ విధులు నిర్వహిస్తుంటారు. ఇవి ఒక ఏడాది పోస్టులు మాత్రమే. అవసరాన్ని బట్టి గడువును నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే అభ్యర్థులు పోస్టులో దరఖాస్తు ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 23 చివరి తేదీ.

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... అర్హతలివే

AP High Court Law Clerk Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


భర్తీ చేసే పోస్టు- లా క్లర్క్

దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 8

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 23 సాయంత్రం 5 గంటలు

వైవా వోసి- 2021 డిసెంబర్ 6

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పాస్ కావాలి.

ఇతర నిబంధనలు- అభ్యర్థులు ఇతర కోర్సులు చేస్తూ ఉండకూడదు. ఏ స్టేట్ బార్ కౌన్సిల్‌లో కూడా అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయి ఉండకూడదు.

వయస్సు- 30 ఏళ్లు

ఎంపిక విధానం- వైవా వోసి ద్వారా ఎంపిక చేస్తారు.

వేతనం- నెలకు రూ.25,000.

ఈ జాబ్ నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

AP High Court Law Clerk Recruitment 2021: దరఖాస్తు విధానం


Step 1- అభ్యర్థులు ముందుగా https://hc.ap.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో నోటిఫికేషన్స్ సెక్షన్‌లో Recruitment పైన క్లిక్ చేయాలి.

Step 3- లా క్లర్క్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.

Step 4- నోటిఫికేషన్ చివర్లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది.

Step 5- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

Step 6- ఏజ్ ప్రూఫ్, విద్యార్హతల సర్టిఫికెట్స్ జత చేసి సెల్ఫ్ అడ్రస్‌తో ఉన్న పోస్టల్ కవర్‌లో అప్లికేషన్ ఫామ్ పంపాల్సి ఉంటుంది.

Step 7- నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 నవంబర్ 23 సాయంత్రం 5 గంటల్లోగా చేరేలా అప్లికేషన్ ఫామ్ పోస్టులో పంపాలి.

Step 8- పోస్టల్ కవర్ పైన "Application for the post of Law Clerks" అని రాయాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

Registrar (Recruitment),

High Court of Andhra Pradesh at Amaravati,

Nelapadu, Guntur District,

Andhra Pradesh,

Pin Code- 522237.

First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, AP News, APPSC, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, State Government Jobs, Telugu news, Telugu varthalu

ఉత్తమ కథలు