హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Police Jobs: ఏపీలో కానిస్టేబుల్ ఫలితాలపై అభ్యర్థులు కోర్టుకు.. కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం.. వివరాలివే..

AP Police Jobs: ఏపీలో కానిస్టేబుల్ ఫలితాలపై అభ్యర్థులు కోర్టుకు.. కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. 8 ప్రశ్నలకు సరైన సమాధానాలు నిర్ణయించలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల (AP Constable Jobs) భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. 8 ప్రశ్నలకు సరైన సమాధానాలు నిర్ణయించలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని నిపుణుల కమిటీకి నివేదించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వాజ్యంపై స్పందించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (AP Police Recruitment Board) చైర్మన్, హైంశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ప్రిలిమ్స్ లో 8 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదానలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని నిపుణుల కమిటీకి పంపించాలని కోరారు.

ఈ నెల 13వ తేదీ నుంచి రెండో దశ నియామకాలైన ఈవెంట్స్ నిర్వహించున్న నేపథ్యంలో వాటికి పిటిషనర్లను అనుమతించాలని కోరారు. వాదనాలను విన్న న్యమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్, హోం శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించించి తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే.. ఈ అంశంపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం అభ్యర్థుల్లో ఉత్కంఠగా మారింది.

Constable Jobs: 10వ తరగతి పాస్ అయిన యువతకు శుభవార్త.. 616 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ..

ఈ నియామకాలకు సంబంధించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పోలీసు విభాగంలోని హోంగార్డు అభ్యర్థులకు సైతం హూకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించకపోవడాన్ని సవాలుచేస్తూ సీహెచ్ గోపి అనే హోంగార్డుతో పాటు మరో ముగ్గురు హోం గార్డులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అందరు అభ్యర్థుల మాదిరిగానే తమకు కటాఫ్ మార్కులు విధించారని.. ఇది సరికాదని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించలేదంటూ.. తమను రెండో దశ నియామక ప్రక్రియ అయిన.. ఈవెంట్స్ కు అనుమతించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన న్యాయస్థానం.. కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ఎంపికలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, Ap police jobs, JOBS

ఉత్తమ కథలు