Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs: డిగ్రీ ఉంటే చాలు.. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..

Andhra Pradesh Jobs: డిగ్రీ ఉంటే చాలు.. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 681 పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఏపీ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దీనిలో జూనియర్ అసిస్టెంట్(Junior Assistant) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 681 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జిల్లా కోర్డుల్లో(District Courts) ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు.

ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి.

1. అనంతపురం-53

2.చిత్తూరు- 67

3.తూర్పు గోదావరి -80

4.గుంటూరు - 64

5.వైఎస్ఆర్ కడప-46

6.కృష్ణ - 68

7.కర్నూలు - 17

8. నెల్లూరు - 33

9.ప్రకాశం - 41

10. శ్రీకాకులం - 62

11.విశాఖపట్నం - 71

12.విజయనగరం - 21

13. పశ్చిమగోదావరి - 58

మొత్తం - 681

ముఖ్యమైన తేదీలు..

-దరఖాస్తులు ప్రారంభ తేదీ 22-10-2022

-దరఖాస్తులకు చివరి తేదీ 11-11-2022

అర్హతలు

అభ్యర్థులకు తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అనంతపురం వాసులకు తెలుగు, కన్నడ భాష వచ్చి ఉండాలి. శ్రీకాకులం, విజయనగం జిల్లా అభ్యర్థులకు తెలుగు, ఒరియా వచ్చి ఉండాలి.

దీంతో పాటు.. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

NEET-UG 2022 Counselling: నీట్ రెండో దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడదుల.. ఆ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం..

వయోపరిమితి

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు.

Group 1 Preliminary Key: అభ్యర్థులకు అలర్ట్.. ఆ రోజు అందుబాటులోకి గ్రూప్ 1 ప్రిలిమినరీ కీ..

ఎంపిక ఇలా..

అభ్యర్థులకు ఆన్ లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. వీటిలొ మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు తదుపరి దశకు పిలుస్తారు.

దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.

AP Jobs 2022: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నాన్ టీచింగ్ ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల.. 

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

-దీనిలో నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని అర్హతలను చెక్ చేసుకోవాలి.

-వాటికి అర్హులుగా ఉంటే.. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

-వెబ్ సైట్ లో అప్లై ఆన్ లైన్ అనే ఆప్షన్ ను ఎంచుకొని వివరాలను నమోదు చేయాలి.

-చివరగా దరఖాస్తు చేసుకున్న ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి.

దరఖాస్తుల సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే.. 0863-2372752 నంబర్ కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ మెయిల్ ఐడీ helpdesk-hc.ap@aij.gov.in కూడా సంప్రదించవచ్చు.

First published:

Tags: Andhra Pradesh, Career and Courses, JOBS

ఉత్తమ కథలు