హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

New Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 957 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ..

New Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 957 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

New Job Notification: ఏపీ వైద్యారోగ్యశాఖలో స్టాప్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 957 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హెల్త్ డైరెక్టర్ , ఏపీవీవీపీ పరిధిలో నర్సు పోస్టులు ఏడాది కాల పరిమితికి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఏపీ వైద్యారోగ్యశాఖలో స్టాప్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 957 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హెల్త్ డైరెక్టర్, ఏపీవీవీపీ పరిధిలో నర్సు పోస్టులు ఏడాది కాల పరిమితికి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఈ నెల 2 నుంచి అంటే నేటి నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులను స్వకరించనున్నారు. సీఎం జగన్(CM Jagan) ఆదేశాలతో యుద్దప్రాతిపదికన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 957 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. జోన్ల వారీగా పోస్టుల వివరాలిలా..

జోన్ఖాళీలు
జోన్ 1163
జోన్ 2264
జోన్ 3239
జోన్ 4291
మొత్తం957

దరఖాస్తు ఫారాలు డిసెంబర్ 8 వరకు http://cfw.ap.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని డిసెంబర్ 8 సాయంత్రం 5 గంటలలోపు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయాల్లో సమర్పించాలి. GNM/BSc నర్సింగ్ పూర్తి చేసిన 42 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు మరియు వికలాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు రూ.300. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వైద్యశాఖ పేర్కొంది.

కోవిడ్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ తదితర ఇతర వెయిటేజీలు వర్తిస్తాయని తెలిపింది. భవిష్యత్తులో ఖాళీగా ఉండే నర్సింగ్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ మెరిట్ జాబితాను వచ్చే ఏడాది ఆగస్టు వరకు పరిశీలిస్తారు. 2019 నుంచి 46 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం 957 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది.

CLAT Admit Cards: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అడ్మిట్ కార్డ్స్.. ఆ తేదీ నుంచి అందుబాటులోకి..

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుల స్వీకరణకు చివర తేదీ డిసెంబర్ 9, 2022

అప్లికేషన్ల పరిశీలను తేదీ - డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 15 వరకు.

ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ - డిసెంబర్ 16 నుంచి 18 వరకు..

అబ్జెక్షన్లకు డిసెంబర్ 16-19వరకు అవకాశం ఇస్తారు.

మెరిట్ లిస్ట్ ను డిసెంబర్ 19, 2022న ప్రకటిస్తారు.

సెలక్షన్ లిస్ట్ ను డిసెంబర్ 20, 2022న ప్రకటించనున్నారు.

అపాయింట్ మెంట్స్ అనేవి డిసెంబర్ 21, 22న అభ్యర్థులకు అందిస్తారు.

దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, Ap jobs, JOBS, Private Jobs

ఉత్తమ కథలు