ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకుల విద్యాలయాల్లో (DR.B.R.AMBEDKAR GURUKULAMS) 5వ తరగతిలో అడ్మిషన్లకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ (AP Grukul Schools Notification) విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఫిబ్రవరి 25న ప్రారంభించారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు మార్చి 24వ తేదీలోగా తమ దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హతలు: అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న విద్యాసంవత్సరంలో నాలుగవ తరగతి విద్యార్థి అయి ఉండాలి.
- సదరు విద్యార్థి వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండాలి.
వయో పరిమితి: ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు సెప్టెంబర్ 1, 2010-ఆగస్టు 31, 2014 మధ్య ఉండాలి. ఓసీ, బీసీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లు సెప్టెంబర్ 1, 2012, ఆగస్టు 31, 2014 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు https://apgpcet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు సమీపంలోని ఏదైనా ఇంటర్నెట్ సంటర్ ద్వారా లేదా దగ్గరలోని Dr.B.R అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
-దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు.
-ఒక్క సారి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని ప్రకటనలో స్పష్టం చేశారు.
పరీక్ష:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Schools, Career and Courses, Gurukula colleges, JOBS