ఏపీ గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా...

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు ప్రకటించారు.

news18-telugu
Updated: July 19, 2020, 6:47 PM IST
ఏపీ గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు ప్రకటించారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై త్వరలో మళ్లీ వెళ్లడిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో 15,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరిలో ఈ ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి... 19 నోటిఫికేషన్లు జారీ చేసింది. గతంలో ఈ ఉద్యోగాలను ఆగస్టులో భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. ‘ఆగస్టు రెండో వారంలో జరగాల్సిన గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలో తెలియజేస్తాం’ అని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు.



ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చరల్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరీ కల్చర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ 6), డిజిటల్ అసిస్టెంట్ , విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ 3), వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. అంతకు ముందు రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 19, 2020, 6:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading