ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (AP Government) చెందిన వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి భారీగా ఉద్యోగాల భర్తీకి (AP Government Jobs) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 461 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 5వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను http://cfw.ap.nic.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
విద్యార్హతలు:
జీఎన్ఎం&బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక:
మొత్తం 100 మార్కులకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇందులో 75 మార్కులను క్వాలిఫైయింగ్ పరీక్షకు కేటాయిస్తారు. మరో 10 శాతం అకాడమిక్ మార్కులకు ఉంటాయి. మరో 15 శాతం మార్కులు అనుభవానికి కేటాయిస్తారు.
దరఖాస్తులను పంపించాల్సిన చిరునామాలు:
1. Regional Director of Medical and Health Services, Opp.Bullaiah College, Resapuvanipalem, Visakhapatnam
2. Regional Director of Medical and Health Services, District Headquarters Hospital Compound, Rajamahendravaram
3.Regional Director of Medical and Health Services, Aswini Hospital Backside, Old Itukulabatti Road, Guntur
4. Regional Director of Medical and Health Services, Old RIMS,Kadapa.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి గుంటూరు జిల్లా వారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. పలు బ్యాక్ లాగ్ ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ (AP Job Notification) విడుదలైంది. మొత్తం 49 బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 06ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, JOBS, State Government Jobs