హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల జాతర... 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల జాతర... 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి.. ఏటా జూన్, డిసెంబర్‌లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి.. ఏటా జూన్, డిసెంబర్‌లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీగా ఉద్యోగాల (AP Govt Jobs) భర్తీ జరగబోతోంది. 14,200 పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) ఆదేశించారు.

  ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) గుడ్ న్యూస్. చెప్పారు. భారీగా ఉద్యోగాలు (Jobs in Andhra Pradesh) భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 14,200 పోస్టుల్ని భర్తీ చేసేందుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఉన్న సిబ్బంది వివరాలతో పాటు ఖాళీగా ఉన్న పోస్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్య సేవల్ని అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండకూడదని జగన్ తెలిపారు.

  Jobs in Guntur: గుంటూరు జిల్లాలో 324 ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

  వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. అక్టోబర్ 1న రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభించి నవంబర్ 15 లోగా నియామకాలు పూర్తి చేయాలని, ఇందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ పూర్తి సిబ్బందితో సమర్థవంతంగా నడవాలని, ఒక డాక్టర్ సెలవులో వెళ్లినా ఆ స్థానంలో మరో డాక్టర్ అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని, అందుకు తగ్గట్టుగా వైద్యుల్ని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఒక వైద్యుడు సెలవు పెడితే, పేషెంట్లకు ట్రీట్మెంట్ దొరకని పరిస్థితి ఉండొద్దని, అలాగని ఇతర వైద్యులపై భారం పడకూడదని జగన్ స్పష్టం చేశారు.

  Lok Sabha Recruitment 2021: రూ.65,000 వరకు వేతనంతో లోక్‌సభలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

  ఏ నెలలో ఏఏ శాఖలో పోస్టుల్ని భర్తీ చేస్తామో వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఖాళీల సంఖ్య తక్కువగా ఉందన్న విమర్శలు వచ్చాయి. అయితే జాబ్ క్యాలెండర్‌తో సంబంధం లేకుండా కూడా ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేస్తోంది. తాజాగా వైద్య, ఆరోగ్య శాఖలో ప్రకటించిన 14,200 పోస్టులు జాబ్ క్యాలెండర్‌తో సంబంధం లేనివే. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 1న జాబ్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

  RBI Scholarship: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40,000 స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా

  ఇవే కాదు... ఇప్పటికే జిల్లాల్లోని పలు ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో 263 పోస్టులు, విజయనగరం జిల్లాలో 53 పోస్టులు, కర్నూలు జిల్లాలో 159 పోస్టులు, విశాఖపట్నంలో 305 పోస్టులు, గుంటూరు జిల్లాలో 324 పోస్టులు, చిత్తూరు జిల్లాలో 129 పోస్టులు, అనంతపురం జిల్లాలో 17 పోస్టుల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులున్నాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, Ap cm jagan, AP News, CAREER, Cm jagan, Govt Jobs 2021, JOBS, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు