ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీసు నియామకాలకు(Police Jobs) సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. 411 సివిల్, రిజర్వ్ ఎస్సై పోస్టులు, 6100 సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 2023 ఫిబ్రవరి 19న సబ్ ఇన్స్పెక్టర్ (Police Sub Inspectors) పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 22న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో ఉద్యోగాల ఖాళీలను(Job Vacancies) భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వెలువరించేందుకు ఏపీ డీజీపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు.
రాష్ట్రంలోని పోలీసు శాఖలో రిటైర్మెంట్స్, పదోన్నతులు, మరణాలతో పాటు ఇటీవల ఏపీ ప్రభుత్వం పోలీసు శాఖకు వీక్ ఆఫ్ ఇస్తుండటంతో సిబ్బంది తక్షణ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే పోలీసు నియామకాలు చేపట్టేందుకు గత నెలలోనే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అప్పటి నుంచి నియామక ప్రక్రియను వేగవంతం చేసిన అధికారులు.. నేడు దీనిపై నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక ఏపీలో పోలీసు ఉద్యోగాల కోసం వేలాదిమంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.
AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే
ఇక ఈ పోస్టుల కోసం పోటీ పడే అర్హతలు ఈ విధంగా ఉండాలి. ఎస్ఐ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులవ్వాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Police