AP GOVERNMENT RELEASED JOB NOTIFICATION FOR 4775 JOB VACANCIES HERE APPLICATION AND SELECTION PROCESS NS
AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 4775 వేల ఖాళీలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
ఏపీ(Andhra Pradesh)లో భారీగా ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4775 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ నియామకాలను కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టింది ఏపీలోని సీఎం జగన్ సర్కార్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 16ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఎలా అప్లై చేయాలంటే..
అభ్యర్థులు hmfw.ap.gov.in, cfw.ap.nic.in వెబ్ సైట్ల ద్వారా ఈ నెల 7 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఎంపిక ఇలా..
బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 6
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 7
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: ఏప్రిల్ 18
మెరిట్ లిస్ట్ ప్రచురణ: ఏప్రిల్ 20
అభ్యంతారల స్వీకరణకు ఆఖరి తేదీ: ఏప్రిల్ 23
ఫైనల్ మెరిట్ లిస్ట్ & ఎంపికైన అభ్యర్థుల వివరాల ప్రకటన: ఏప్రిల్ 25
అభ్యర్థుల ఎంపికపై అభ్యర్థుల స్వీకరణ: ఏప్రిల్ 26
తుది ఎంపిక వివరాల ప్రకటన: ఏప్రిల్ 27
కౌన్సెలింగ్: ఏప్రిల్ 28 నుంచి 30.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.