ఏపీ సీఎంగా వైఎస్ జగన్ (AP CM Jagan) బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఒకే సారి రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను (AP Government Jobs) మంజూరు చేసి.. వాటి భర్తీకి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగు నెలల్లోనే నియామకాలు పూర్తి చేసి రికార్డు సృష్టించింది జగన్ సర్కార్. 2019 జూలై – అక్టోబర్ నెలల మధ్య మొదటి విడతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రభుత్వం. అప్పట్లో మిగిలిపోయిన ఖాళీలకు సంబంధించి 2020 జనవరి నెలలో రెండో విడత నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఆ ఏడాది సెప్టెంబర్ నెలలో ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను నిర్వహించి నియామకాలను పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది.
ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి నియామక ప్రక్రియలోనూ పలు మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ విధానంలోనే చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.
మరో వారం రోజుల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో నిర్వహించిన నియామకాలకు సంబంధించిన రాత పరీక్షను ఆఫ్ లైన్ విధానంలోనే నిర్వహించారు. అయితే.. సాధ్యమైనంత త్వరగా నియామకాలను పూర్తి చేయడం కోసం ఈ సారి ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Cm jagan, Job notification, JOBS, State Government Jobs