AP GOVERNMENT OFFICIALS RELEASED JOB NOTIFICATION FOR VARIOUS VACANCIES AT KARNOOL DISTRICT FOLLOW THIS STEPS TO APPLY NS
AP Government Jobs: ఏపీలోని ఆ జిల్లాలో డిగ్రీ, టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
ఏపీలోని ఆ జిల్లాలో డిగ్రీ, టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్..
ఏపీలో పలు ఉద్యోగాల (AP Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా (Corona) నేపథ్యంలో వైద్య విభాగంలో ఖాళీల భర్తీకి ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్నాయి. కేంద్ర, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా వైద్యవిభాగంలోని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఉద్యోగా భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
పోస్టు
ఖాళీలు
స్టాఫ్ నర్స్
10
డేటా ఎంట్రీ
2
లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్
2
మొత్తం
14
స్టాఫ్ నర్స్: కాంట్రాక్ట్ విధానంలో ఈ విభాగంలోని 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. GNM కోర్స్, బీఎస్సీ(Nursing) విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.22 వేలు చెల్లించనున్నారు. Date Entry Operator:ఔట్ సోర్సింగ్ విభాగంలో ఈ విభాగంలోని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.15 వేలు చెల్లించనున్నారు. APPSC Jobs: ఏపీపీఎస్సీ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఆ ఎగ్జామ్ రాయాల్సిందే?
Last Grade Service Staff:ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ విభాగంలో 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వేతనం చెల్లించనున్నారు. వయస్సు:ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 42 ఏళ్లు ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఇచ్చారు.
ఎలా అప్లై చేయాలంటే.. Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://kurnool.ap.gov.in/ ను ఓపెన్ చేయాలి. Step 2:అనంతరం హోం పేజీలో Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయండి. Step 3:అనంతరం నోటిఫికేషన్ పక్కన అప్లికేషన్ ఫామ్ (Application Form) పై క్లిక్ చేయండి. Step 4:అనంతరం మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం అక్కడ సూచించిన వవరాలను నమోదు చేయాలి. Step 5:అప్లికేషన్ ఫామ్ ను ఈ రోజు సాయంత్రం 5.00 గంటలలోగా DM&HO, Kurnool చిరునామాలో అందించాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.