Home /News /jobs /

AP GOVERNMENT JOBS NOTIFICATION RELEASED FOR ANGANWADI JOB VACANCIES HERE APPLICATION PROCESS NS

AP Anganwadi Jobs: ఏపీలో టెన్త్ పాసైన మహిళలకు అలర్ట్.. అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో అంగన్ వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఏపీలోని విజయనగరం (Vijayanagaram) జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అంగన్ వాడీ (anganwadi) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అంగన్ వాడీలు 10, అంగన్ వాడీ హెల్పర్స్ 73, మినీ అంగన్ వాడీ హెల్పర్స్ విభాగంలో మరో 3 ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    విద్యార్హతల వివరాలు:
    -అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. ఇంకా స్థానిక గ్రామానికి చెందిన వివాహిత అయి ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
    AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి







    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు ముందుగా విజయనగరం జిల్లా అధికారిక వెబ్ సైట్ ను ఈ లింక్ ద్వారా ఓపెన్ చేయాలి.
    Step 2: హోం పేజీలో Anganwadi Helper, Worker, Mini Anganwadi Workers Notification పేరుతో లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అంగన్ వాడీ అప్లికేషన్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
    Step 4:అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను నింపాలి. నింపిన ఫామ్ ను శిశు అభివృద్ధి పథకపు అధికారిణి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, విజయనగరం, ఏపీ చిరునామాకు ఈ నెల 23లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు