నిరుద్యోగులకు శుభవార్త...ఏపీపీఎస్సీ నుంచి 5 నోటిఫికేషన్‌లు

అటవీశాఖ, గిరిజన, బీసీ సంక్షేమశాఖ సహా పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి శుక్రవారం ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 550 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయింది.

news18-telugu
Updated: February 12, 2019, 7:43 PM IST
నిరుద్యోగులకు శుభవార్త...ఏపీపీఎస్సీ నుంచి 5 నోటిఫికేషన్‌లు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 7:43 PM IST
ఏపీ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో తీపి కబురుచెప్పింది. అటవీశాఖ, గిరిజన, బీసీ సంక్షేమశాఖ సహా పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి శుక్రవారం ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 550 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయింది. వీటిలో 50 అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసర్లు, 330 పారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు, 100 అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్లు పోస్టులు ఉన్నాయి. ఇక గిరిజన, బీసీ సంక్షేమశాఖలో 28 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలో 29 డిప్యూటీ సర్వేయర్లు, ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌లో 18 ఖాళీల భర్తీకి కూడా నోటిఫికేషన్లు విడుదలచేసింది.

అటవీశాఖ ఉద్యోగాలకు మార్చి 5 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లకు ఈనెల 27 నుంచి మార్చి20 వరకు, డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు ఈనెల 20 నుంచి మార్చి 13 వరకు, ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ పోస్టులకు ఈనెల 19 నుంచి మార్చి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హత, వయసు, పరీక్ష ఫీజు వంటి పూర్తి వివరాలను APPSC వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...