Home /News /jobs /

AP GOVERNMENT JOBS APPLICATIONS INVITING FOR VARIOUS MEDICAL JOBS VACANCIES AT PRAKASHAM DISTRICT HERE DETAILS NS

AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (AP Government Jobs) విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీవీ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయడానికి వేర్వేరుగా నోటిఫికేషన్లను (Job Notification) విడుదల చేశారు అధికారులు. మొత్తం 166 ఖాళీలను ఆయా నోటిఫికేషన్లను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

    డీఎంహెచ్ఓ (ప్రకాశం జిల్లా)
    - ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 08 ఖాళీలు
    - ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 03
    - ఎఫ్ఎన్ఓ-06
    - శానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్:8 పోస్టులు
    NLC Recruitment 2022: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు అవకాశం..

    జిల్లా కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్)
    రేడియోగ్రాఫర్:04 పోస్టులు
    డైటీషియన్: 01 పోస్టు
    ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 07
    ల్యాబ్ అటెండెంట్: 05 పోస్టులు
    ఆఫ్తాలిక్ అసిస్టెంట్:03 పోస్టులు
    బయో మెడికల్ ఇంజనీర్:03
    ఆడియో మెట్రీషియన్/ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 03
    ఆఫీస్ సబార్డినేట్: 08 పోస్టులు
    జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 62
    జనరల్ డ్యూటీ అటెండెంట్స్ (థియేటర్ అసిస్టెంట్): 02
    ప్లంబర్:03

    గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఒంగోలు
    లైబ్రరీ అసిస్టెంట్: 01
    ఎలక్ట్రీషియన్ గ్రేడ్-2: 2 పోస్టులు
    ల్యాబ్ అటెండెంట్:01

    జీజీహెచ్ (ఒంగోలు):
    అనస్థీషియా టెక్నీషియన్: 06 ఖాళీలు
    ఆడియోమెట్రిక్ టెక్నీషియన్:01
    ఈసీజీ టెక్నీషియన్:09
    ఈఈజీ టెక్నీషియన్:01
    ఎలక్ట్రీషియన్ గ్రేడ్-2:01
    ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్:03
    జనరల్ డ్యూటీ అటెండెంట్:11 పోస్టులు
    ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2:1
    ఫార్మసిస్ట్ గ్రేడ్ 2:01
    రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్: 01
    రేడియోలాజికల్ ఫిజిసిస్ట్:01



    విద్యార్హతల వివరాలు:
    వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టు ఆధారంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, పీజీ డిప్లొమా, సంబంధిత సర్టిఫికేట్ కోర్సులు చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
    దరఖాస్తు ఎలా చేయాలంటే:
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను జిల్లా వైద్యరోగ్య అధికారి, ప్రకాశం జిల్లా చిరునామాకు ఈ నెల 20వ తేదీలోగా పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థుల మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job notification, JOBS, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు