కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
- జూనియర్ అసిస్టెంట్ విభాగంలో 1 ఖాళీ ఉంది. అభ్యర్థులకు డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.18,500 వేతనం ఉంటుంది.
- లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (అటెండర్): ఈ విభాగంలో 5 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 వేతనం చెల్లించనున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రము, విద్యార్హత సర్టిఫికేట్ల కాపీలను జతపరిచి పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అసిస్టెంట్ కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, కాకినాడ జిల్లా, కాకినాడ డోర్ నంబర్.3-16B-101/2, గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ, NCC ఆఫీస్ దగ్గర, శాంతినగర్ 5వ లైన్, పిన్ కోడ్-533003 చిరునామాకు చేరేలా పంపించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.