ఏపీలోని నిరుద్యోగులకు భూగర్భ జలం, జలల గణన శాఖ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (AP Jobs Notification) విడుదల చేసింది. మొత్తం 74 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఈ ఖాళీలను (AP Jobs) భర్తీ చేస్తున్నారు. అయితే.. కాంట్రాక్ట్ పద్ధతితో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై (AP Jobs Application) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల ఎంపికకు సంబంధించి ఎలాంటి పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
శ్రీకాకుళం | 2 |
విజయనగరం | 01 |
పార్వతీపురం మన్యం | 02 |
అల్లూరి సీతారామరాజు | 04 |
విశాఖపట్నం | 02 |
అనకాపల్లి | 02 |
కాకినాడ | 2 |
డా.అంబేద్కర్ కోనసీమ | 1 |
తూర్పుగోదావరి | 02 |
ఏలూరు | 2 |
కృష్ణా | 2 |
ఎన్టీఆర్ | 2 |
గుంటూరు | 1 |
పల్నాడు | 3 |
బాపట్ల | 1 |
ప్రకాశం | 4 |
శ్రీ సత్యసాయి | 3 |
వైఎస్ఆర్ కడప | 4 |
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు | 5 |
తిరుపతి | 4 |
అన్నమయ్య | 4 |
చిత్తూరు | 4 |
డైరెక్టర్ కార్యాలయం, జీడబ్ల్యూ&డబ్ల్యూఏడీ, విజయవాడ | 05 |
విద్యార్హతలు: సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. వయస్సు మార్చి 31 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనం చెల్లించనున్నారు. ఇంకా టూర్ అలవెన్స్ కింద మరో రూ.5 వేలను చెల్లించనున్నారు.
DRDO Recruitment 2022: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. డీఆర్డీఓలో 1901 ఉద్యోగాలు .. పూర్తి వివరాలివే
దరఖాస్తు ఇలా:
అభ్యర్థులు దరఖాస్తులను www.apsgwd.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ను పూర్తిగా నింపి సంబంధిత జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లకు అందించాలి. వారి చిరునామాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. దరఖాస్తుకు ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జిల్లా గ్రౌంట్ వాటర్ ఆఫీసర్స్ కార్యాలయంలో అక్టోబర్ 11 ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Job notification, JOBS