ఆ విద్యార్థులకు షాక్.. భారీగా పెరిగిన ఫీజులు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఎంపీటీ కోర్సులకు ఫీజులు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఎంపీటీ కోర్సులకు ఫీజులు నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫీజులు 2020-21 వరకు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే హాస్టల్ ఫీజు, ట్రాన్స్పోర్ట్, మెస్ చార్జీలు, రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజులు, లైబ్రరీ, ల్యాబ్ డిపాజట్లు మినహా మిగతా అన్ని రకాల ఫీజులు బోధన రుసుములోకే వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ కోర్సులకు కన్వీనర్ కోటా ఫీజును రూ. 18 వేలుగా నిర్వహించారు.

  యాజమాన్య కోటా కింద రూ. 80 వేలు ఖరారు చేశారు. ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సుకు కన్వీనర్ కోటా ఫీజు రూ. 83 వేలుగా నిర్ణయించారు. ఇందులో మేనేజ్మెంట్ కోటా ఫీజు రూ. 1.49 లక్షలుగా ఖరారు చేశారు. ఎంపీటీకి కన్వీనర్ కోటా ఫీజు రూ.94 వేలు కాగా.. యాజమాన్య కోటా ఫీజు రూ.1.60 లక్షలుగా ఖరారు చేశారు. పలు కోర్సులకు గతంలో పోల్చితే ఫీజు బాగా పెరిగింది.

  ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎంమంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలల్లో రానున్న విద్యా సంవత్సరం 2021–22 నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) విద్యా విధానాన్ని ప్రారంభించున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత తరగతులకు వరుసగా ఒక్కో ఏడాది పెంచుకుంటూ సీబీఎస్సీ విద్యా విధానాన్ని వర్తింప చేస్తామని వివరించారు. 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు చెప్పారు.
  Published by:Nikhil Kumar S
  First published: