AP EDUCATION DEPARTMENT OFFICIALS RELEASED SSC 2022 BOARD EXAMS MODEL PAPERS HERE DIRECT LINK TO DOWNLOAD NS
AP Tenth Exams Model Papers: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. వెబ్ సైట్లో ఫైనల్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్లు.. లింక్ ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్ ఎగ్జామ్స్ కు (AP Tenth Exams) సంబంధించి ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ ఎగ్జామ్స్ కు సంబంధించి 11 పేపర్లను 7కు కుదించింది. ఇందుకు సంబంధించిన మోడల్ పేపర్లను (AP Tenth Model Papers) ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది.
కరోనా (Corona) నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సమయానికి పూర్తి అవుతుందా? లేదా? అన్న ఆందోళన విద్యార్థుల్లో (Students) వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని సీఎం జగన్ సర్కార్ (AP Government) ఇటీవల టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలపై (Exams) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న పరీక్షల పేపర్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టెన్త్ ఎగ్జామ్ ను 11 పేపర్లలో నిర్వహించేవారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్యను 7కు కుదించింది జగన్ సర్కార్. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను సైతం ఏడు పేపర్లతోనే నిర్వహించున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు ఒకే ఎగ్జామ్ ఉండగా.. ఒక సైన్స్ మాత్రం రెండు పేపర్లను నిర్వహించనున్నారు. ఇందులో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి 50 మార్కులకు ఒక పేపర్, జీవశాస్త్రానికి 50 మార్కులకు ఉంటుంది. AP Tenth Exams: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
Step 4: ఆ పేజీలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి న ఇంగ్లిష్, తెలుగు మోడల్ పేపర్లకు సంబంధించిన లింక్ లు కనిపిస్తాయి. Step 5: ప్రతీ పేపర్ పక్కన Click Here అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి మోడల్ పేపర్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.