ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ (AP 10th Exams 2022) తేదీలు మారాయి. వాస్తవానికి మే 2 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉండగా.. ఇంటర్ ఎగ్జామ్స్ (AP Inter Exams) తేదీలతో క్లాష్ అవుతున్నాయి. దీంతో టెన్త్ ఎగ్జామ్స్ తేదీలను అధికారులు మార్చారు. మార్చిన తేదీలను అధికారులు తాజాగా ప్రకటించారు. ఏప్రిల్ 27 నుంచి 9 వ తేదీ వరకు పరీక్షలను (Exams) నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 27-తెలుగు, ఏప్రిల్-28-సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 29-ఇంగ్లిష్, మే 2-గణితం, మే 4-సైన్స్-4, మే 5-సైన్స్ పేపర్-2, మే 6న సోషల్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ 50 మార్కుల చొప్పున.. మిగతా అన్ని పరీక్షలు 100 మార్కులకు నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ 50 మార్కుల చొప్పున.. మిగతా అన్ని పరీక్షలు 100 మార్కులకు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిజికల్, బయోలాజికల్ సైన్స్ ఎగ్జామ్స్ ఉదయం 9.30 గంల నుంచి 12.15 గంటల వరకు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం తాజాగా మారిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను (Intermediate Exams Schedule) సైతం తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే పరీక్షలను వాయిదా వేసిన ఇంటర్ బోర్డు.. కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. తొలుత ఏప్రిల్ 22 నుంచి మే 12వరకు పరీక్షలు నిర్వహించాలని చూసినా.. జేఈఈ పరీక్షల (JEE Exams) కారణంగా వాయిదా వేసింది. Board exams: పిల్లలను ఒత్తిడి లేకుండా ఉంచడానికి తల్లిదండ్రులకు ఈ చిట్కాలు..
తాజాగా కొత్త తేదీలను విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి మే 24 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మే 6న ప్రారంభమై.. మే 23వ తేదీతో ముగుస్తాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు మే 7వ తేదీ నుంచి మే 24 వరకు జరుగుతాయని షెడ్యూల్లో పేర్కొంది. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.