AP ECET 2021 FINAL PHASE SEAT ALLOTMENT DECLARED CHECK YOUR SEAT DETAILS NS GH
AP ECET 2021: ఏపీ ఈసెట్ చివరి దశ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల.. ఏ కాలేజీలో సీటొచ్చిందో ఇలా చూసుకోండి
ఏపీ ఈసెట్ చివరి దశ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల.. ఏ కాలేజీలో సీటొచ్చిందో ఇలా చూసుకోండి
ఏపీ ఈసెట్–2021 (AP ECET-2021) సీట్ల కేటాయింపులో షార్ట్‌లిస్ట్ అయిన విద్యార్థులు డిసెంబరు 18 లోపు నేరుగా కళాశాలకు వెళ్లి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఏపీ ఈసెట్–2021 కళాశాలల (Colleges) వారీగా సీట్ల కేటాయింపును కూడా విడుదల చేసింది. మీకు ఏ కాలేజీలో సీటొచ్చిందో విషయాన్ని ఇలా సులభంగా చెక్ చేసుకోండి.
లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET-2021) సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిన్న రాత్రి ఈ ఫలితాలను (Results) విడుదల చేసింది. వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులు తమ సీట్ల కేటాయింపు వివరాలు, కళాశాలలో జాయినింగ్ రిపోర్ట్ కాపీలను అధికారిక వెబ్సైట్ www.ecet-sche.aptonline.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఏపీ ఈసెట్–2021 సీట్ల కేటాయింపులో షార్ట్‌లిస్ట్ అయిన విద్యార్థులు డిసెంబరు 18 లోపు నేరుగా కళాశాలకు వెళ్లి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఏపీ ఈసెట్–2021 కళాశాలల వారీగా సీట్ల కేటాయింపును కూడా విడుదల చేసింది. మీకు ఏ కాలేజీలో సీటొచ్చిందో విషయాన్ని ఇలా సులభంగా చెక్ చేసుకోండి. IIIT- Delhi: ఫాస్ట్ రిటైలింగ్ భాగస్వామ్యంతో ఐఐఐటీ ఢిల్లీ స్కాలర్షిప్.. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం
ఏపీ ఈసెట్ ఎంట్రన్స్ టెస్ట్‌ను ఆంధ్ర ప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ హయ్యార్ ఎడ్యుకేషన్ తరపున జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ) అనంతపురం నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా బీఈ/బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండవ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. మూడేళ్ల డిప్లొమా/పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసి ఇంజినీరింగ్ డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. లేటరల్ ఎంట్రీ విధానంలో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్లైన్ కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. సీటు దక్కించుకున్న అభ్యర్థులు.. ఎంపికైన ఇంజినీరింగ్ లేదా ఫార్మసీ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సీటు అలాట్ అయిన కాలేజీలో డిసెంబర్ 18లోపు సెల్ఫ్ రిపోర్ట్ చేసిన అభ్యర్థులకే సీటు కేటాయిస్తారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.