హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP EAPCET 2022: నేటి నుంచి EAPCET వెబ్ ఆప్షన్స్ ప్రారంభం.. ఆ రోజు నుంచే తరగతులు..

AP EAPCET 2022: నేటి నుంచి EAPCET వెబ్ ఆప్షన్స్ ప్రారంభం.. ఆ రోజు నుంచే తరగతులు..

AP EAPCET 2022: నేటి నుంచి EAPCET వెబ్ ఆప్షన్స్ ప్రారంభం.. ఆ రోజు నుంచే తరగతులు..

AP EAPCET 2022: నేటి నుంచి EAPCET వెబ్ ఆప్షన్స్ ప్రారంభం.. ఆ రోజు నుంచే తరగతులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు (AP EAPCET 2022) సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఇంటర్మీడియట్‌ (AP Inter) అర్హత మార్కుల్లో సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్(Engineering), ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు (AP EAPCET 2022) సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఇంటర్మీడియట్‌ (AP Inter) అర్హత మార్కుల్లో సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ తాజాగా ఆదేశాలను జారీచేసింది. ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండియర్లలో కలిపి 45%, లేదా రెండో ఏడాదిలోనే 45% మార్కులు ఉన్నా ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు(EAPCET Counseling) దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. గ్రూపు సబ్జెక్టుల్లో 45% మార్కులు ఉన్నా కూడా కౌన్సెలింగ్ కు అర్హులేనని అధికారులు స్పష్టం చేశారు. రిజర్వుడు అభ్యర్థులకు 40% మార్కులు ఉంటే సరిపోతుందని ప్రకటనలో పేర్కొన్నారు.

TSPSC New Notification: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. పోస్టులు, అర్హత వివరాలిలా.. 

కరోనా కారణంగా ఈ సారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను (Exams) నిర్వహించలేదు. విద్యార్థులు మార్కుల పెంచుకునేందుకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించినా.. కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేదు. దీంతో చాలామందికి అర్హత మార్కులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈ సడలింపులను ఇచ్చింది ఉన్నత విద్యాశాఖ. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

ఇదిలా ఉండగా.. AP EAPCET 2022 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నేటి నుంచి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. నేటి నుంచి ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఈ వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కన్వీనర్ సి. నాగరాణి షెడ్యూల్ విడుదల చేశారు.

Government Job Notifications: ఇంటర్, డిగ్రీ/బీటెక్ అర్హతతో 4 నోటిఫికేషన్లు విడుదల.. వివరాలు తెలుసుకోండి..

సెప్టెంబర్ 14 నంచి సెప్టెంబర్ 17 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఈ తేదీల్లో నంబర్ 1 ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వచ్చిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆప్షన్ల నమోదులో ఏమైనా అభ్యంతరాలు , మార్పులు ఉంటే.. ఈ నెల 18న వారికి అవకాశం ఇవ్వనున్నారు. తమ ఆప్షన్ల నమోదు మార్చుకోవాలంటే..ఓటీపీ, మొబైల్ నంబర్ లాంటి సమస్యలు ఏర్పడితే.. సమీపంలోని హెల్ప్ లైన్ కేంద్రాన్ని సందర్శించాలని కన్వీనర్ సూచించారు. సీట్ల కేటాయింపు అనేది ఈ నెల 22న పూర్తి అవుతుంది.

Singareni JA Results: తప్పులతడకగా సింగరేణి ఫలితాలు.. తప్పుడు పేర్లపై అధికారుల సమాధానం ఇదే..

సీట్ అలాట్ అయిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ తో పాటు.. ఆయా కాలేజీల్లో ఈ నెల 23 నుంచి 27లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు పాఠాలు ఈ నెల 26 నుంచి మొదలుకానున్నాయి. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://eapcet-sche.aptonline.in/EAPCET/ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. వెబ్ ఆప్షన్ ఎంట్రీ కి సబంధించి పూర్తి వివరాలకు ఈ పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Ap eamcet, AP EAPCET, Career and Courses, JOBS

ఉత్తమ కథలు