Home /News /jobs /

AP EAPCET 2022 RESULTS ANNOUNCED ANDHRA PRADESH ENGINEERING AGRICULTURE AND PHARMACY COMMON ENTRANCE TEST RESULTS RELEASED CHECK HERE FOR DIRECT LINK SS

AP EAPCET Results 2022: ఏపీ ఈఏపీసెట్ 2022 ఫలితాలు విడుదల... రిజల్ట్స్ లింక్ ఇదే

AP EAPCET Results 2022: ఏపీ ఈఏపీసెట్ 2022 ఫలితాలు విడుదల... రిజల్ట్స్ లింక్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

AP EAPCET Results 2022: ఏపీ ఈఏపీసెట్ 2022 ఫలితాలు విడుదల... రిజల్ట్స్ లింక్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

AP EAPCET Results 2022 | ఏపీ ఎంసెట్‌గా పిలిచే ఏపీ ఈఏపీసెట్ 2022 ఫలితాలు వచ్చేశాయి. 2,82,496 మంది విద్యార్థులు ఈసారి ఈ పరీక్ష రాశారు. ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేయొచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఫలితాలను విడుదల చేశారు. జూలై 4 నుంచి 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 3,01,172 మంది విద్యార్థులు అప్లై చేయగా 2,82,496 మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్ ఎగ్జామ్‌కు 1,94,752, వ్యవసాయ పరీక్షకు 87,744 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన రెండు వారాల తర్వాత ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

AP EAPCET Results 2022: ఏపీ ఈఏపీసెట్ 2022 ఫలితాలు చెక్ చేయండి ఇలా


Step 1- విద్యార్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో AP EAPCET Results 2022 ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 3- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

Step 4- ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.

Step 5- ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.

Indian Post Recruitment 2022: పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలివే

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ అనంతపూర్ ఏపీ ఈఏపీసెట్ పరీక్షల్ని నిర్వహించింది. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్‌కు హాజరుకావాలి. ర్యాంకును బట్టి కౌన్సిలింగ్‌లో సీట్లు లభిస్తాయి.

Clerk Jobs 2022: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 క్లర్క్ ఉద్యోగాలు... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

ప్రతీసారి ఈఏపీసెట్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఇస్తోంది ప్రభుత్వం. ఈసారి ఇంటర్ మార్కుల వెయిటేజీ లేదు. కాబట్టి ర్యాంకులన్నీ ఈఏపీసెట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Ap eamcet, AP EAPCET, JOBS, Results

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు