Home /News /jobs /

AP EAPCET 2022 HALL TICKETS RELEASED HERE IS THE DIRECT LINK TO DOWNLOAD HALL TICKETS NS

AP EAPCET - 2022 Halltickets: ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ తో డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లను (AP EAPCET 2022) అధికారులు తాజాగా విడుదల చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్-AP EAMCET 2022 (AP EPACET) కు సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్లైన్లో ఈ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు AP EPACETకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్లో ఈ హాల్ టికెట్లను (AP EAPCET Hall Tickets) డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను నమోదు చేసి ఈ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జులై 4, 5, 6, 7, 8 తేదీల్లో ఇంజనీరింగ్ కు సంబంధించిన ప్రవేశ్ పరీక్ష ఉంటుంది. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షను జులై 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు.

    ప్రతీ రోజు రెండు సెషన్లలో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు ఇలా రెండు మాధ్యమాల్లో ఈ పరీక్ష ఉంటుంది. మొత్తం 160 మార్కులకు ఈ ఎగ్జామ్ ను నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు సాధించిన మార్కులు, వారి రిజర్వేషన్ల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకు ఆధారంగా.. కౌన్సెలింగ్ లో వారికి సీట్ల కేటాయింపులు ఉంటాయి. అయితే.. ఎంసెట్ కు సంబంధించిన ఫలితాలు ఆగస్టు మూడో వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
    AP EAMCET 2022 Tips: ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. బెస్ట్ ర్యాంక్ రావాలంటే ఈ టిప్స్ పాటించండి

    అభ్యర్థులు ఈ స్టెప్స్ తో తమ AP EPACET హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి..
    Step 1: అభ్యర్థులు మొదటగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ (https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx) ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం AP EAPCET - 2022 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం మీకు AP EAPCET - 2022 వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
    Step 4: హోం పేజీలో Download Hall Ticket ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 5: అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్, Qualifying Examination Hall Ticket No, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి Proceed ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 6: మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Ap eamcet, Career and Courses, Exams, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు