Home /News /jobs /

AP EAPCET 2022 ALERT FOR ANDHRA PRADESH STUDENTS RELEASE OF AP EAPCET 2022 NOTIFICATION KNOW DETAILS EVK

AP EAPCET 2022: ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఏపీ EAPCET 2022 నోటిఫికేష‌న్ విడుద‌ల.. వివ‌రాలు

AP EAPCET 2022

AP EAPCET 2022

AP EAPCET 2022 | ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్ర‌భుత్వం నిర్వ‌హించే ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.

ఇంకా చదవండి ...
    AP EAPCET 2022: ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్ర‌భుత్వం నిర్వ‌హించే ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. అర్హులైన‌ విద్యార్ధులు ఈ రోజు (ఏప్రిల్‌ 11) నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులెవరైనా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ రెండో ఏడాది పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx ను సంద‌ర్శించాలి.

    Telangana Jobs: ఆ పోస్టులే ముందుగా భ‌ర్తీ చేయ‌నున్నారా..? నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు ఏర్పాట్లు పూర్తి




    ముఖ్య‌మైన తేదీలు







































    దరఖాస్తు ప్రక్రియతేదీ
    ద‌ర‌ఖాస్తులు ప్రారంభం11.04.2022
    లేట్ ఫీజు లేకుండా ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీ10.05.2022
    రూ.500/ ఆల‌స్య రుసుముతో ఆఖ‌రు తేదీ20.06.2022
    ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ తేదీలు23.06.2022 to 26.06.2022
    రూ.1000/- ఆల‌స్య రుసుమ‌తో ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీ25.06.2022
    రూ.5000/- ఆల‌స్య రుసుముతో ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీ01.07.2022
    హాల్ టికెట్ డౌన్‌లోడ్27.06.2022
    రూ.10,000/- ఆల‌స్య రుసుముతో ఆఖ‌రు తేదీ03.07.2022

    AP EAPCET 2022 పరీక్ష జులై 4 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఏపీ ఈఏపీసెట్‌ ద్వారా బీఈ, బీటెక్‌, బీటెక్‌ (బయోటెక్‌), బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, Pharm-D కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

    Jobs in AP: ఏపీవీవీపీలో 554 పోస్టులు.. వేత‌నం నెల‌కు రూ. 53,500.. దరఖాస్తుకు ఒక్కరోజే చాన్స్!

    ఈ ఏడాది నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌ 2022)లో ఇంటర్‌ వెయిటేజీ తొలగించనున్నారు.  వెయిటేజీ తొలగిస్తే 100 శాతం మార్కల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తారని సమాచారం.

    ఇంజ‌నీరింగ్ ప‌రీక్ష తేదీ     04.07.2022 to 08.07.2022
    అగ్రికల్చ్ర్ అండ్ ఫార్మ‌సీ ప‌రీక్ష తేదీ    11.07.2022 to 12.07.2022
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Career and Courses, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు