AP EAMCET Results 2019: 18న ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఎంసెట్‌కు తెలంగాణ, ఏపీల నుంచి 2,82,901మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజనీరింగ్‌కు 1,95,908మంది, వ్యవసాయ, వైద్య కోర్సులకు 86,993మంది హాజరయ్యారు.

news18-telugu
Updated: May 14, 2019, 12:12 PM IST
AP EAMCET Results 2019: 18న ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
2021 జనవరి 25 నుంచి రెండో సెమిస్టర్ ప్రారంభం అవుతుంది.
  • Share this:
ఏపీ ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. మొదట 17 లేదా 18న విడుదల చేయాలని భావించారు. అయితే, తెలంగాణ, ఏపీ ఇంటర్మీడియట్‌ మార్కులతో ర్యాంకుల కేటాయింపు పూర్తయ్యేందుకు 17వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో 18వ తేదీనే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. జేఎన్‌టీయూ కాకినాడ ఈ ఫలితాలను విడుదల చేయనుంది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్‌మిట్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఏపీ ఎంసెట్‌కు తెలంగాణ, ఏపీల నుంచి 2,82,901మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజనీరింగ్‌కు 1,95,908మంది, వ్యవసాయ, వైద్య కోర్సులకు 86,993మంది హాజరయ్యారు. ఏప్రిల్‌ 20 నుంచి 24వరకు ఎంసెట్‌ నిర్వహించారు. రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. గతేడాది మే 3న ఫలితాలు విడుదల చేయగా.. ఈసారి తెలంగాణ ఇంటర్మీడియట్‌ మార్కులు రావడంలో ఆలస్యం కావడంతో ఫలితాల్లో జాప్యం జరిగింది.

కాగా, ముందుగా ఈ రిజల్ట్స్ మే 1న విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. కానీ, గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు రావడంతో ఎంసెట్‌కు వెయిటేజీ ఎలా ఇవ్వాలనే దానిపై సందిగ్ధత కొనసాగడంతో ఫలితాల ప్రకటనని ఆ రోజుకు వాయిదా వేశారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
* ముందుగా అఫిషియల్ వెబ్‌సైట్ ‘ఏపీ ఎంసెట్’ లింక్‌పై క్లిక్ చేయండి..
* ఇప్పుడు ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్ submit చేయండి..
* వెంటనే స్క్రీన్‌పై రిజల్ట్స్ వస్తాయి..

ఏపీ SSC రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి..
Published by: Shravan Kumar Bommakanti
First published: May 14, 2019, 12:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading