ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్‌ని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంకులను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంజినీరింగ్ విభాగంలో పినిశెట్టి రవితేజ మొదటి ర్యాంకు సాధించగా. మెడికల్‌లో వెంకటసాయి స్వాతి మొదటి ర్యాంక్ సాధించింది. జూన్ 10నుంచి ర్యాంక్ కార్డ్స్‌ని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా, విద్యార్థుల మొబైల్ నెంబర్లకే ర్యాంకుల smsలు వస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి 24 వరకు నిర్వహించిన ఎంసెట్ ఎగ్జామ్‌ని ఏపీ, తెలంగాణల్లో కలిపి మొత్తం 2,82,901 మంది రాశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం కారణంగా వాయిదా పడుతున్న రిజల్ట్స్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యాయి. ఈ రిజల్ట్స్‌ని కింద చెప్పినట్లుగా చెక్ చేసుకోండి.
ఏపీ ఎంసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
1. ముందుగా అధికారిక లింక్ ఓపెన్ చేయండి..
2. ఏపీ ఎంసెట్-19పై క్లిక్ చేయండి
3. ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ 2019పై క్లిక్ చేయండి
4. మీ రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరును నమోదు చేయండి
5. సబ్మిట్ నొక్కగానే.. మీ రిజల్ట్ ప్రత్యక్షం అవుతుంది.
6. రిజల్ట్స్ కాపీని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి.
7. విద్యార్థులు వెబ్సైట్లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు..
గతేడాది మే 3నే ఎంసెట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా అలానే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసిన తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ గందరగోళం, ఇంటర్ వెయిటేజీ కారణంగా పలుమార్లు వాయిదా పడ్డాయి. దాదాపు 36వేల మందికి పైగా తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాశారు. వీరికి ర్యాంకులు కేటాయించేందుకు ఇంటర్ మార్కుల వెయిటేజీ అవసరం కానుంది. దీంతో ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంది.
ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25% వెయిటేజీ ఉంది. మొత్తం 2,82,901 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాశారు. ఇంజనీరింగ్ పరీక్షకు 1,85,711 మంది హాజరు కాగా.. వ్యవసాయ, వైద్య విద్య పరీక్షకు 81,916 మంది హాజరయ్యారు. జేఎన్టీయూ కాకినాడ ఈ ఫలితాలను విడుదల చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap, AP Board Results, AP EAMCET 2019, Exams, Results