AP EAMCET PREPARATION TIPS IF YOU READ THIS YOU HAVE A CHANCE TO GET GOOD MARKS FULL DETAILS HERE VB TPT
AP EAMCET Preparation Tips: ఏపీ ఎంసెట్ ప్రిపరేషన్ టిప్స్.. ఇలా చదివితే మంచి మార్కులు సాధించే అవకాశం..
ప్రతీకాత్మక చిత్రం
ఏపీ ఎంసెట్ విద్యార్థుల బవితకు బాటలు వేసే మొదటి కంపిటేటివ్ పరీక్షా ఎంసెట్. విద్యార్థులు ఎంసెట్ ను లైట్ తీసుకుంటే.. డాక్టర్., ఇంజనీర్ అవ్వడం చాలా కష్టం. విద్యార్థులు ఎంతో ఏకాగ్రతతో ఎంసెట్ పరీక్షలపై దృష్టి ఉంచాలి.
ఏపీ ఎంసెట్(AP Eamcet) విద్యార్థుల భవితకు బాటలు వేసే మొదటి కంపిటేటివ్ పరీక్షా ఎంసెట్(EAMCET). విద్యార్థులు ఎంసెట్ ను లైట్ తీసుకుంటే.. డాక్టర్(Doctor)., ఇంజనీర్(Engineer) అవ్వడం చాలా కష్టం. విద్యార్థులు(Students) ఎంతో ఏకాగ్రతతో ఎంసెట్ పరీక్షలపై దృష్టి ఉంచాలి. నిద్ర(Sleep), భోజన సమయాలను మినహాయించి మిగిలిన అన్ని సమయాల్లో ఎంసెట్ సబ్జెక్టులను(Eamcet Subjects) తరావుగా చదువుకోవాలి. కొందరు విద్యార్థులు(Students) ఒక్క రోజులో చదివేస్తాం.. రెండు వారాల్లో పూర్తి చేస్తాం అనుకుంటే వారి భవిత ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 20 రోజుల్లో రోజును నాలుగు భాగాలుగా విభజించి.. ఒక్కో సబ్జెక్టుకు 3 గంటల సమయం కేటాయించాలి.
ఒక్కో సబ్జెక్టు లో ఒక్కో చాప్టర్ పూర్తి చేయాలి. అన్ని చాఫ్టర్లు కంప్లీట్ అయిపోతే మళ్లీ వాటిని రివిజన్ చేసుకోవాలి. పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన చాఫ్టర్లు తరావుగా చదువుకోవాలి. ఎంసెట్ పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఎలా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు అనే వివరాలను తిరుపతి జిల్లా ఎస్వీ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రియవర్ధన్ బాబు సూచించారు.
ఇంటర్మీడియట్(Intermediate) పూర్తయిన విద్యార్థులు(Students) ఇంజినీరింగ్(Engineering) వంటి కోర్సులు (Courses) చదవాలన్నా.. సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా.. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎన్నో యూనివర్సిటీలు(Universities) పలు కోర్సుల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంటర్ తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. ఈ రెండిట్లో ఏది అవసరమో ఎంచుకునేందుకు పలు రకాల పరిస్థితులు దోహదం చేస్తాయి.సైన్స్ సబ్జెక్టులతో(Science subjects) ఇంటర్(Inter) పూర్తిచేసిన వారిలో ఎక్కువ శాతం మంది చూపు ఇంజినీరింగ్ పైనే ఉంటుంది. అందుకే ఏటా ఇంజినీరింగ్‌కు ఎంసెట్‌కు లక్షల్లో విద్యార్థులు పోటీ పడుతుంటారు. సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడంలేదు.
ప్రిపరేషన్ మొదలు పెట్టే నాటి నుంచి ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు ఒక్కో చాప్టర్ ను చదివేస్తూ.... సునాయాసంగా ఎంసెట్ సిలబస్ ను కంప్లీట్ చేయవచ్చు. మనం చదివే సబ్జెక్టులపై విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. కష్టమైన టాపిక్ ను ముందుగా చదవకుండా.. సులువుగా ఉండే టాపిక్స్ ను చదువుకోవాలి. దీంతో మనలో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. తరువాత కష్టమైన చాఫ్టర్లు సైతం సులువుగా నేర్చుకొనే అవకాశం ఉంది. ఇలా ప్రతి సబ్జెక్టు లోను సులువైన టాపిక్స్. కష్టమైన టాపిక్స్ డివైడ్ చేసి చదువుకోవాలి.
బోటనీ, జువాలజీ, ఫీజిక్స్, కెమిస్ట్రీని నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేసుకోవాలి. చాప్టర్ వైస్ మనం చదువుకోవాలి. మనకు అర్థం అయిన చాఫ్టర్లు ముందుగా చదువుకొని... మిగిలిన చాప్టర్స్ లో సందేహాలు ఉంట్టే సంబంధిత అధ్యాపకులను సంప్రదించి అనుమానం నివృత్తి చేసుకోవాలి. కొండను చూసి భయపడటం కాదు... ఆ కొండను ఎలా పిండి చేయాలన్న ఆలోచన విద్యార్థుల్లో ఉండాలి. ఫీజిక్స్ అంటే భయం అనుకోకండి... ఫీజిక్స్ తరవుగా చదివితే చాలా ఈజీగా ఉంటుంది. ఫిజిక్స్ అర్థం అయితే మిగతా అన్ని సబ్జెక్టులు చాలా సులభంగా ఉంటాయి. ముఖ్యంగా బోటనీ, జువాలజీ., కెమిస్ట్రీ, ఫిజిక్స్ లో ఈజీ టాపిక్స్ నేర్చుకుంటే మంచిదని అధ్యాపకులు సూచించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.