AP EAMCET COUNSELLING BEGINS LIST OF DOCUMENTS NEEDED TO REGISTER NS
AP EAPCET-2021 Counselling: ఏపీలో ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్.. కావాల్సిన ధ్రువపత్రాలు, తెలుసుకోవాల్సిన విషయాలివే
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో ఎంసెట్ కౌన్సెలింగ్ (AP EAPCET - 2021) ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ (AP EAPCET - 2021 Counselling) కు కావాల్సిన సర్టిఫికేట్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన AP EAPCET - 2021 పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్ (APEAPCET-2021 Counselling) నిన్నటి నుంచి ప్రారంభమైంది. రిజస్ట్రేషన్ల (Registrations) ప్రక్రియ నిన్నటి నుంచి (అక్టోబర్ 25) ప్రారంభం కాగా 30వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ (APEAPCET Certificates Verification) ఈ రోజు నుంచి ప్రారంభమైంది. వెరిఫికేషన్ ప్రక్రియ 31వ తేదీ వరకు ఉంటుంది. అయితే విద్యార్థులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ఈ కింది సర్టిఫికేట్లను అధికారిక వెబ్ సైట్లో (https://eapcet-sche.aptonline.in/EAPCET/)అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ కు కావాల్సిన ధ్రువపత్రాలు..
1.APEAPCET-2021 Rank card
2. APEAPCET-2021 Hall Ticket
3.ఇంటర్ మెమో
4.టెన్త్ మెమో
5. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్
7. మైనారిటీ సర్టిఫికేట్(If applicable)
8. కుల ధ్రువీకరణ పత్రం
9. ఆధాయ ధ్రువీకరణ పత్రం
10. PH/NCC/CAP/Sports and Games Certificates(If applicable)
11. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్
-కౌన్సెలింగ్ కు సంబంధించిన ఇతర పూర్తి వివరాలను, సమగ్ర సమాచారాన్ని అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. AP EAMCET: ఏపీ ఎంసెట్ 2021 కౌన్సెలింగ్ తేదీలు విడుదల.. పూర్తి వివరాలివే..
APEAPCET - 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
-అధికారిక వెబ్ సైట్ sche.ap.gov.in ను సందర్శించాలి.
-హెం పేజీలో అడ్మిషన్ లింక్ (AP EAPCET-2021 Admissions)కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
-మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది.
-Candidate Registration పై క్లిక్ చేయాలి. అక్కడ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి
- తర్వాత సంబంధిత సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.
ఫీజు చెల్లించాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి. UGC-NET 2021: విడుదలైన యూజీసీ నెట్ పరీక్షల తేదీలు.. వివరాలివే..
ఏపీ ఎంసెట్ 2021 కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్:
-అక్టోబర్ 25 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపుల ప్రక్రియ జరుగుతుంది.
-అక్టోబర్ 26 నుంచి 31 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.
-నవంబర్ 1 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్ ఎంట్రీ (వెబ్ ఆప్షన్లకు)కి అవకాశం కల్పిస్తారు.
-ఫైనల్ సబ్మిషన్ కు నవంబర్ 1 నుంచి 6 వరకు సమయం ఉంటుంది. ఈ సమయంలో ముందస్తుగా సేవ్ చేసిన ఆప్షన్స్ లో మార్పులు చేయొచ్చు. Learning English: ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? గూగుల్ సెర్చ్ ఫీచర్ ద్వారా మీ పని సులభం చేసుకోండి..
-నవంబర్ 10, 2021న సీట్లను కేటాయిస్తారు.
-నవంబర్ 10 నుంచి 15 వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
-అకడమిక్ సెషన్ నవంబర్ 15, 2021 ప్రారంభం అవుతుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.