హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP EAMCET Counselling: నేటి నుంచే ఏపీ ఎంసెట్ సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్.. విద్యార్థులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే....

AP EAMCET Counselling: నేటి నుంచే ఏపీ ఎంసెట్ సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్.. విద్యార్థులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే....

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ ఎంసెట్ 2021 (EAPCET-2021) సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్‌ కు సంబంధించిన నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తాజాగా విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎంసెట్ (eapcet- 2021) తుది విడత అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ (Eapcet Counselling)నేడు ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. చివరి దశ అయిన రెండో రౌండ్ కౌన్సెలింగ్ తాజాగా ప్రారంభమైంది. డిసెంబరు 3, 2021 నాటికి రెండో విడత కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 5 వరకు కాలేజీ, కోర్సు ఆఫ్షన్ ఎంట్రీలను నమోదు చేయాలి. ఏపీ ఎంసెట్ 2021 కౌన్సెలింగ్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) నిర్వహిస్తోంది. రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా AP EAMCET అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.inలోనే నమోదు చేసుకోవాలి.

ఇందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

-అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి, హోమ్‌పేజీలో అభ్యర్థుల నమోదు చివరి దశ కౌన్సెలింగ్ లింక్‌పై క్లిక్ చేయాలి.

-రెండో విడత కౌన్సెలింగ్ దరఖాస్తు కోసం నేరుగా eapcet-sche.aptonline.in/EAPCET/register.do లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

-అనంతరం ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.

-ఆ తరువాత అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.

IGNOU July 2021: ఇగ్నో జులై సెషన్ రిజిస్ట్రేషన్ గడువు మ‌ళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..

-అనంతరం దరఖాస్తు ఫారం కాపీని విద్యార్థులు ప్రింట్ తీసుకోవాలి.

-అభ్యర్థులు డిసెంబరు 6న ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంటుంది.

-డిసెంబరు 9న సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల చేస్తారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి, అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

IIT Gandhinagar: ఐఐటీ​లో ఇంటర్న్‌షిప్.. రూ. 28 వేల స్టైఫండ్.. కేవలం మూడు రోజులే అవ‌కాశం​

ఏపీ ఎంసెట్- 2021 చివరి విడత కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు

1. ఏపీ ఎంసెట్ 2021 తుదివిడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్: డిసెంబరు 2 నుంచి 3 వరకు

2. నోటిఫైడ్ హెల్ప్ లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్స్ ఆన్‌లైన్ వెరిఫికేషన్: డిసెంబరు 3 నుంచి 4 వరకు

3. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ: డిసెంబరు 2 నుంచి 5 వరకు

4. వెబ్ ఆప్షన్ ఎంట్రీ మార్పులు: డిసెంబరు 6, 2021

5. ఏపీ ఎంసెట్ 2021 సీట్ల కేటాయింపు ఫలితాలు: డిసెంబరు 9

Appsc Recruitment 2021 : ఏపీపీఎస్‌సీలో ఉద్యోగాలు.. జీతం రూ.75000, ప‌రీక్ష విధానం, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు


కౌన్సెలింగ్ సమయంలో అవసరమైన పత్రాలు

కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులు ఏపీ ఎంసెట్- 2021 ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, ఇంటర్మీడియట్ మార్కుల షీట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ రుజువు కోసం పదో తరగతి మార్కుల మెమో, EWS సర్టిఫికేట్ (వర్తించే వారికి మాత్రమే), నివాస ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల ఇన్‌కమ్ సర్టిఫికేట్.. వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Andhra Pradesh, AP EAMCET 2020, Career and Courses, EDUCATION, TS EAMCET 2021