హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP EAMCET Result 2020: ఏపీ ఎంసెట్ ఎలాట్‌మెంట్ ఫలితాలు రిలీజ్. ఇలా చెక్ చేసుకోండి

AP EAMCET Result 2020: ఏపీ ఎంసెట్ ఎలాట్‌మెంట్ ఫలితాలు రిలీజ్. ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఎంసెట్ ఎలాట్‌మెంట్ ఫలితాలు రిలీజ్. ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఎంసెట్ ఎలాట్‌మెంట్ ఫలితాలు రిలీజ్. ఇలా చెక్ చేసుకోండి

AP EAMCET Result 2020: ఓవైపు కరోనాకి వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు జరుగుతుంటే... మరోవైపు ఈ ఏడాది విద్యా శాఖను ఎప్పట్లాగే నిర్వహించేందుకు ఏపీ ఎంసెట్ సహా వరుస ఫలితాలు విడుదల అవుతున్నాయి.

  AP EAMCET Allotment Result 2020: ఏపీ ఎంసెట్ ఎలాట్‌మెంట్ ఫలితాలు 2020ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ - APSCHE విడుదల చేసింది. కౌన్సెలింగ్ రౌండ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు... ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ apeamcet.nic.in లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఫలితాలు ఎలా చెక్ చోసకోవాలో, ఏ లింక్స్ క్లిక్ చెయ్యాలో పూర్తి సమాచారం కింద లభిస్తోంది. దీన్ని చదివి... ఎంతో ఈజీగా ఫలితాలను తెలుసుకునేందుకు అభ్యర్థులకు వీలవుతుంది. ఎలాంటి టెన్షనూ లేకుండా ప్రశాంతంగా ఫలితాలను తెలుసుకోవచ్చు.

  విద్యార్థులు... అభ్యర్థుల లాగిన్ విండో నుంచి తమ ఎలాట్‌మెంట్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏ అభ్యర్థులకు ఎలాట్‌మెంట్ సీటు లభిస్తుందో, వారు, సంబంధిత సంస్థకు చెప్పిన తేదీలోగా ఈ విషయాన్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులంతా... తమ ప్రొవిజినల్ సీట్ ఎలాట్‌మెంట్ లెటర్‌ను ఆన్‌లైన్‌లో ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీట్ ఎలాట్‌మెంట్‌కి కావాల్సిన డాక్యుమెంట్లు... ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, క్లాస్ 12 మార్కులు కమ్ పాస్ సర్టిఫికెట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC), క్లాస్ 10 మార్కులు కమ్ పాస్ సర్టిఫికెట్. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లవచ్చు.

  AP EAMCET Result 2020, AP EAMCET 2020, Candidates, ap eamcet seat allotment 2020, ap eamcet seat allotment, ap eamcet 2020 counselling schedule, andhra pradesh eamcet allotment results, apeamcet nic in, ap eamcet counselling dates, ఏపీ ఎంసెట్ ఫలితాలు, ఎపీ ఎంసెట్ అలాట్‌మెంట్ ఫలితాలు, ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ 2020,
  ఏపీ ఎంసెట్ ఎలాట్‌మెంట్ ఫలితాలు రిలీజ్. ఇలా చెక్ చేసుకోండి

  AP EAMCET Allotment Result 2020: ఇలా చెక్ చేసుకోండి.

  - ముందుగా ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ apeamcet.nic.in లోకి వెళ్లండి.

  - పేజీలో పైన ఉన్న క్యాండిటేట్ లాగిన్ లింక్‌ను క్లిక్ చెయ్యండి.

  - మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి, సబ్‌మిట్ క్లిక్ చెయ్యండి.

  - ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు.

  - ఆ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. ఓ హార్డ్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం మీ దగ్గర ఉంచుకోండి.

  ఇది కూడా చదవండి:Cow Dung Paint: గేదె పేడతో తయారైన పెయింట్... ఎందుకో తెలుసా?

  మూడు రౌండ్లలో సీట్ అలాట్‌మెంట్‌ ఉంటుంది. ప్రతి రౌండ్ కౌన్సెలింగ్‌కూ సీట్ ఎలాట్‌మెంట్ ఉంటుంది. మొత్తం సీట్లలో 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటా ద్వారా కాలేజీలో ఫిలప్ అవుతాయి. అర్హత ఉన్న అభ్యర్థులు మేనేజ్‌మెంట్ కోటాలో సీటు కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: AP EAMCET 2020, AP News

  ఉత్తమ కథలు