AP EAMCET 2022 TIPS HERE IS THE SCORING TOPICS IN AP EAMCET PHYSICS NS VSP
AP EAMCET Tips: ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ టిప్స్ తో ఫిజిక్స్ లో బెస్ట్ స్కోర్
ప్రతీకాత్మక చిత్రం
ఎంసెట్‌కు (EAMCET) ప్రిపేర్ అవుతున్నారా? అన్ని సబ్జెక్టులపై కసరత్తులు చేస్తున్నారా? ఇంక సమయం తక్కువే ఉంది..ఇలాంటి టైంలోనే కాస్త ఆలోచనతో కొన్ని సెలక్టెడ్ టాపిక్స్‌ను కవర్ చేస్తే మంచిదంటున్నారు లెక్చరర్స్. మరి ఫిజిక్స్‌లో స్కోరు చేయాలంటే ఏ టాపిక్స్ చూడాలి.
(ఆనంద్ మోహన్, న్యూస్18 ప్రతినిధి, విశాఖపట్నం)
ఎంసెట్ (EAMCET) కోసం లక్షల సంఖ్యలో తెలుగురాష్ట్రాల విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ (Exam) రాయడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అయితే చివరి నిమిషంలో కంగారు పడకుండా రివైజ్ చేసుకోవడం మంచిదంటున్నారు.. సాయి రామ్ ఎంపవర్ అకాడమీలో పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ జోగి. ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో అనుభవం ఉన్న లెక్చరర్ అయిన జోగి తక్కువ సమయంలో అందులో సులభంగా స్కోర్ చేయడం ఎలానో వివరించారు. ఎంసెట్‌లో (EAMCET Exam Tips) మంచి స్కోరు చేయాలంటే మ్యాథ్స్ ఎంత ముఖ్యమో.. ఫిజిక్స్ అంతే ముఖ్యమంటున్నారు జోగి. అన్ని సబ్జెక్ట్స్ కంటే ఫిజిక్స్ బిన్నంగా, కష్టంగా ఉండడం వలన విద్యార్థులు అంత దృష్టి పెట్టరు. కానీ ఫిజిక్స్ ఫార్ములాలు (Physics Formula) తెలిస్తే చాలు ఈజీగా స్కోర్ చేయవచ్చంటున్నారు. ఎందుకు అంటే.. ఫిజిక్స్‌లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. వాటిని జస్ట్ ఫార్ములాలతో సాధించే కేపాబిలిటీ ఉంటే చాలని చెబుతున్నారు.
ఫిజిక్స్‌లో స్కోరింగ్ టాపిక్స్:
ఫిజిక్స్‌లో ఇంటర్ మొదటి సంవత్సరంలో Laws of motion, Power, energy ఈ చాప్టర్స్ నుంచి తేలిక ప్రశ్నలు వస్తాయని..వాటితో మంచి స్కోరు సాధించొచ్చంటున్నారు. ఫార్ములాలు నేర్చుకుని వాటిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటే సగం మార్కులు వచ్చినట్లే అంటున్నారు. gravitation, oscillations, system of particles, thermodynamics ఉన్నాయి. ఇందులో thermos dynamics నుంచి ఈజీగా స్కోర్ చేయవచ్చు. ఈ టాపిక్స్ మీద ప్రత్యేక దృష్టి పెడితే కచ్చితంగా ఇందులో నుంచి టెన్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు. TS EAMCET Preparation Tips: మ్యాథ్స్ పై పట్టు సాధిస్తే.. ఎంసెట్ లో ర్యాంక్ సులువే.. నిపుణుల సలహాలు, సూచనలివే..
సెకండ్ ఇయర్లో స్కోరింగ్ టాపిక్స్ :
ఇంటర్ రెండో సంవత్సరంలో waves, current, electricity, moving charges and magnetism, atom మీద ఏకాగ్రత చేస్తే ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది.
ఒక సాధారణ స్టూడెంట్ ఈ టాపిక్స్ మీద ఎక్కువ సమయం శ్రద్ధ చూపితే 25 నుంచి 30 మార్కులు వరుకు సాధించవచ్చు అని జోగి మాస్టర్ తెలిపారు. మెరిట్ స్టూడెంట్స్ అయితే అన్నిటి మీద దృష్టి పెడితే 40 మార్కులుకి 35 వరుకు సాధిస్తారు అని తెలిపారు.
ఇది ఒకసారి చూస్తే వచ్చేది కాదు.. ప్రాక్టీస్ చేస్తే ఇట్టే వచ్చేస్తాయి. చివరి నిమషము వరుకు ఫార్ములాలు (formulas) ప్రిపేర్ అయి ఉంటే చక్కటి మార్కులు సాధించవచ్చు. ఫిజిక్స్ స్కోరింగ్ బట్టి విద్యార్థుల ఎంసెట్ ర్యాంక్ మారవచ్చని…అన్ని సబ్జెక్ట్స్ కలిపి 90 నుంచి 110 వరుకు వస్తే మంచి యూనివర్సిటీ, కాలేజీలో సీటు పొందే అవకాశం ఉంటుందని ఫిజిక్స్ లెక్చరర్ జోగి న్యూస్18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.